1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 12 నవంబరు 2017 (16:26 IST)

ఐఫోన్ కొనుగోలుదార్లకు జియో బంపర్ ఆఫర్

దేశీయ టెలికాం సునామీ రిలయన్స్ జియో ఆపిల్ ఐఫోన్లను కొనుగోలు చేసే వారికి బంపర్ ఆఫర్లను ప్రకటించింది. జియో వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ఈ ఫోన్లను కొనుగోలు చేసిన వారికి ఈ ఆఫర్లు వర్తించనున్నాయి.

దేశీయ టెలికాం సునామీ రిలయన్స్ జియో ఆపిల్ ఐఫోన్లను కొనుగోలు చేసే వారికి బంపర్ ఆఫర్లను ప్రకటించింది. జియో వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ఈ ఫోన్లను కొనుగోలు చేసిన వారికి ఈ ఆఫర్లు వర్తించనున్నాయి. గూగుల్ పిక్సల్ 2, పిక్సల్ 2 ఎక్స్‌ఎల్, ఆపిల్ ఐఫోన్ 10, ఐఫోన్ 8, 8 ప్లస్ ఫోన్లను కొనుగోలు చేసే యూజర్లకు వీటిని ఇవ్వనున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది.
 
ఈ ఆఫర్లలో భాగంగా, పిక్సల్ 2 లేదా పిక్సల్ 2 ఎక్స్‌ఎల్ ఫోన్లను కొంటే రూ.22,999 విలువైన బెనిఫిట్స్‌ను అందివ్వనుంది. తొలుత రూ.9,999 విలువ చేసే యేడాది ప్లాన్‌ను ఉచితంగా అందివ్వనుంది. దీని ప్రకారం యూజర్లకు ఏడాది పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ వస్తాయి. దీంతోపాటు ఉచితంగా 750 జీబీ 4జీ డేటా లభిస్తుంది. డేటా మొత్తాన్ని వాడుకుంటే స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. అలాగే, ఈ ఫోన్లను హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.8 వేల వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. 
 
ఇకపోతే, ఆపిల్‌కు చెందిన ఐఫోన్ 10, 8, 8 ప్లస్ ఫోన్లను సిటీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.8వేల వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. దీంతోపాటు యూజర్లకు 70 శాతం బై బ్యాక్ ఆఫర్ వస్తుంది. అంటే యేడాది పాటు నెలకు రూ.799 ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటూ జియో సిమ్‌ను పైన ఆపిల్ ఫోన్లలో వాడితే యేడాది తర్వాత ఆ ఫోన్లను వాటి ధరలో 70 శాతం మొత్తానికి యూజర్లు అమ్ముకోవచ్చు. అయితే ఫోన్లపై ఎలాంటి గీతలు పడరాదు, ఫిజికల్ డ్యామేజ్ ఉండదు.