రిలయన్స్ జియో ట్రిపుల్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌

దేశీయ టెలికాం సంచలనం రిలయన్స్ జియో మరో సరికొత్త ఆఫర్ ప్రకటించింది. జియోకు ధీటుగా వివిధ సంస్థలు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు వీలుగ

reliance jio
pnr| Last Updated: శుక్రవారం, 10 నవంబరు 2017 (08:43 IST)
దేశీయ టెలికాం సంచలనం రిలయన్స్ జియో మరో సరికొత్త ఆఫర్ ప్రకటించింది. జియోకు ధీటుగా వివిధ సంస్థలు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు వీలుగా జియో మరో సరికొత్త ఆఫర్‌త ముందుకు వచ్చింది.

ఈ కంపెనీ సేవలు ఒకప్పుడు ఉచిత ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకున్న జియో ఇప్పుడు ‘ట్రిపుల్‌ క్యాష్‌ బ్యాక్‌’ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.399 అంతకన్నా ఎక్కువ రీఛార్జ్‌ చేసుకున్న వారికి మూడురెట్లు క్యాష్‌బ్యాక్‌ అందిస్తున్నట్లు వెల్లడించింది. అత్యధికంగా రూ.2,599 వరకూ క్యాష్ బ్యాక్ పొంద‌వ‌చ్చు.

ట్రిపుల్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ కింద 100 శాతం క్యాష్‌బ్యాక్‌ వోచర్లను పొందవచ్చు. ప్రతీ రూ.399 అంతకన్నా ఎక్కువ రీఛార్జ్‌ చేసుకున్న వారికి రూ.400 విలువ చేసే వోచర్లు ల‌భిస్తాయి. రూ.300 ఇన్‌స్టాంట్‌ క్యాష్‌ బ్యాక్‌ వెంటనే ఖాతాలోకి వచ్చి చేరుతుంది. కేవలం ఇది జియో ప్రైమ్‌ సభ్యులకు మాత్రమే. నవంబర్‌ 10 నుంచి 25 తేదీ వరకూ ఈ ఆఫర్‌ చెల్లుబాటు అవుతుంది.

క్యాష్‌బ్యాక్‌ మూడు కేటగిరీలు విభజించారు. రూ.50 విలువ చేసే 8 వోచర్లను మై జియో ఖాతాలో నవంబర్‌ 15 నుంచి వినియోగించుకోవచ్చు. ఇతర మొబైల్‌ వ్యాలెట్‌లకు కూడా నేరుగా క్యాష్‌బ్యాక్‌ వచ్చి చేరుతుంది. ఇక ఇ-కామర్స్‌ వోచర్లను నవంబర్‌ 20, 2017 నుంచి వినియోగించుకోవచ్చని ఆ సంస్థ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.దీనిపై మరింత చదవండి :