శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr

జియో ఫోన్ పేలిందా? లేదా? రిలయన్స్ జియో స్పందనేంటి?

దేశీయ టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఓ సంచలనం. జియో మొబైల్ సేవలు ప్రారంభమైన తర్వాత కాల్, ఇంటర్నెట్ చార్జీలు గణనీయంగా తగ్గిపోయాయి. అదేసమయంలో రిలయన్స్ జియో అందిస్తున్న ఉచిత 4జీ ఫీచర్ ఫోన్ మరో సంచలనం రేపిం

దేశీయ టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఓ సంచలనం. జియో మొబైల్ సేవలు ప్రారంభమైన తర్వాత కాల్, ఇంటర్నెట్ చార్జీలు గణనీయంగా తగ్గిపోయాయి. అదేసమయంలో రిలయన్స్ జియో అందిస్తున్న ఉచిత 4జీ ఫీచర్ ఫోన్ మరో సంచలనం రేపింది. అయితే, ఇపుడు ఆ ఫోన్ పేలి పోయిందనే వార్త పెను సంచలనమైంది. 
 
కాశ్మీర్‌లో ఓ వ్యక్తి ఇంట్లో ఛార్జింగ్ పెట్టిన జియో ఫోన్ పేలిందని రాడార్ అనే టెక్నాలజీ బ్లాగ్ దీన్ని ప్రచురించింది. ఫోన్ బ్యాక్ ప్యానల్ మొత్తం దెబ్బతిన్న ఫొటో కూడా పోస్ట్ చేసింది. రాడార్‌ అందించిన నివేదిక ప్రకారం చార్జింగ్‌‌లో ఉండగా జియో ఫీచర్‌ పోన్‌ పేలింది. 
హ్యాండ్‌సెట్‌ వెనుక భాగం పూర్తిగా కాలిపోయింది. కరిగిపోయినట్టు రిపోర్ట్‌ చేసింది. జియో ఫోన్ పేలింది అన్న సమాచారం ఒక్కసారిగా కలకలం రేపింది. రాడార్ కథనాన్ని కోట్ చేస్తూ.. జాతీయ వెబ్ పోర్టల్స్ సైతం జియో ఫోన్ పేలుడుని ప్రముఖంగా హైలెట్ చేశాయి. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
 
దీనిపై రిలయన్స్ జియో కంపెనీ యాజమాన్యం స్పందించింది. ఈ సమాచారం మా దృష్టికి కూడా వచ్చింది. ఇది కొందరు కావాలని సృష్టించారని.. ఎవరూ నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. ఛార్జింగ్ పెట్టినప్పుడు పేలలేదని తెలిపింది. దీని వెనుక ఏదో జరిగి ఉండొచ్చని అభిప్రాయపడింది. జియో ఫీచర్ ఫోన్ అంతర్జాతీయ ప్రమాణాలతో తయారు చేసినట్టు తెలిపింది. అన్నీ పరిశీలించిన తర్వాతే బయటకు విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. దీనిపై మరింత విచారణ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.