ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 18 నవంబరు 2017 (17:28 IST)

నయనను బంగారం.. అని పిలిచిన విఘ్నేష్.. ఇక పెళ్లే తరువాయి..

గోపి నయినార్ దర్శకత్వంలో అగ్ర హీరోయిన్ నయనతార నటించిన అరమ్ సినిమా బంపర్ హిట్ అయ్యింది. లేడి ఓరియెంటెడ్ రోల్‌లో నయన అదరగొట్టేసింది. దీంతో ఆమెను ఫ్యాన్స్‌తో పాటు విశ్లేషకులు కూడా లేడి సూపర్ స్టార్ అంటూ

గోపి నయినార్ దర్శకత్వంలో అగ్ర హీరోయిన్ నయనతార నటించిన అరమ్ సినిమా బంపర్ హిట్ అయ్యింది. లేడి ఓరియెంటెడ్ రోల్‌లో నయన అదరగొట్టేసింది. దీంతో ఆమెను ఫ్యాన్స్‌తో పాటు విశ్లేషకులు కూడా లేడి సూపర్ స్టార్ అంటూ పిలుస్తున్నారు. దక్షిణాది టాప్ హీరోయిన్ అయిన నయన వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతోంది. నయనకు నేడు (నవంబర్ 18) పుట్టినరోజు. 
 
ఈ నేపథ్యంలో నయన లవర్ దర్శకుడు విఘ్నేశ్ శివన్ బర్త్ డే బేబీకి ఎలాంటి గిఫ్ట్ ఇస్తాడని అందరూ ఎదురుచూశారు. ఫ్యాన్స్ ఆత్రుతకు తగినట్టే విఘ్నేష్ కూడా నయనతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ.. నయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 
 
అంతేగాకుండా నయనను ఉద్దేశించి "నీవు ధైర్యవంతురాలని, అందమైనదానివని.. నిన్ను చూసి నేనెంతో గర్వపడుతున్నానని.. నిన్ను గౌరవిస్తున్నాను.. తంగమే (బంగారం)..." అంటూ కామెంట్ జోడించాడు. ఈ కామెంట్‌తో నయన, విఘ్నేష్‌ల మధ్య ప్రేమాయణం ఖరారైపోయిందని.. త్వరలోనే ఈ జంట పెళ్లిపీటలెక్కుతుందని నయన ఫ్యాన్స్ జోస్యం చెప్పేస్తున్నారు. నయన బర్త్ డే రోజున  విఘ్నేష్ చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. 
 
మరోవైపు నయనతార బాలయ్యతో జత కట్టే జై సింహ సినిమా శరవేగంగా జరుగుతోంది. తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించే ఈ సినిమాలో నయన లుక్‌ను ఆమె పుట్టిన రోజు సందర్భంగా యూనిట్ విడుదల చేసింది.