1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. nayanthara birthday on Twitter

నయనతారకు పుట్టినరోజు.. లేడి సూపర్ స్టార్‌కు శుభాకాంక్షల వెల్లువ

దక్షిణాది అగ్రహీరోయిన్‌ అయిన నయనతారకు నేడు పుట్టినరోజు. 1984వ సంవత్సరం నవంబర్ 18వ తేదీన పుట్టిన కురియన్ కొడియట్టు, ఒమన్ కురియన్ దంపతులకు నయనతార జన్మించింది. మలయాళీ క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన నయనతార

nayanthara
దక్షిణాది అగ్రహీరోయిన్‌ అయిన నయనతారకు నేడు పుట్టినరోజు. 1984వ సంవత్సరం నవంబర్ 18వ తేదీన పుట్టిన కురియన్ కొడియట్టు, ఒమన్ కురియన్ దంపతులకు నయనతార జన్మించింది. మలయాళీ క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన నయనతార తండ్రి.. ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి కావడంతో చెన్నై, గుజరాత్, ఢిల్లీ వంటి పలు నగరాల్లో స్కూల్ చదువులు చేయాల్సి వచ్చింది. 
 
కేరళలోనే ఇంటర్మీడియేట్ పూర్తి చేసింది. కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ చేసే నయనకు మలయాళీ డైరక్టర్ సత్యన్ అంతిక్కాడ్ మనస్సినక్కరే అనే సినిమా ద్వారా ఆమెకు హీరోయిన్‌గా తొలి అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత వరుసగా మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి మలయాళ అగ్ర హీరోల సరసన నటించింది. తమిళంలో అయ్య సినిమా ద్వారా పరిచయం అయిన నయనతార ఆపై చంద్రముఖి, గజినీ వంటి సినిమాలతో అగ్రహీరోయిన్‌గా మారిపోయింది. ఇక తెలుగులో లక్ష్మీ, బాస్ వంటి సినిమాల్లో గుర్తింపు సంపాదించింది. ఆపై భారీ ఆఫర్లతో వరుసగా సినిమాలు చేస్తూ దక్షిణాది టాప్ హీరోయిన్‌గా మారిపోయింది. 
 
ప్రస్తుతం అరమ్ సినిమా ద్వారా లేడి సూపర్ స్టార్ అనే పేరు కూడా కొట్టేసింది. నయనతార సినీ కెరీర్‌లో వల్లభ, బిల్లా, శ్రీరామరాజ్యం వంటి సినిమాలకు ఫిల్మ్ ఫేర్, నంది అవార్డులు వచ్చాయి. 2010లో నయనతార ప్రభుదేవాతో ప్రేమాయణం పెళ్లిదాకా వస్తుందనుకున్నారు. కానీ 2012లోనే ప్రభుదేవాతో బ్రేకప్ అయ్యింది. ప్రస్తుతం మరో దర్శకుడితో ఆమె లవ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
 
వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం. పుట్టినరోజు సందర్భంగా భారీ క్రేజ్ ఆఫర్లను చేతిలో పెట్టుకుని బిజీ బిజీగా వున్న నయనతారకు శుభాకాంక్షలు చెప్పేద్దాం. ఇప్పటికే సోషల్ మీడియాలో నయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 
About Writer
selvi
తర్వాతి కథనం
వాడి పెళ్లాం ఎక్కడో పుట్టినట్టుందిలే..