సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 13 నవంబరు 2017 (16:36 IST)

కీర్తి సురేష్‌ బాగానే బుట్టలో వేసుకుంటోంది! (వీడియో)

వెండితెరపై సందడి చేస్తున్న మలయాళీ భామల్లో కీర్తి సురేష్ ఒకరు. ఇటు టాలీవుడ్‌లోనే కాకుండా, ఇతర దక్షిణాది భాషల్లో కూడా ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ‘నేను శైలజ’ అనే చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు

వెండితెరపై సందడి చేస్తున్న మలయాళీ భామల్లో కీర్తి సురేష్ ఒకరు. ఇటు టాలీవుడ్‌లోనే కాకుండా, ఇతర దక్షిణాది భాషల్లో కూడా ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ‘నేను శైలజ’ అనే చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్ వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
 
మహానటి సావిత్రి బయోపిక్‌గా తెరకెక్కుతున్న ‘మహానటి’ చిత్రంతోనూ బిజీగా ఉంది. అలాగే, పవన్ కళ్యాణ్ చిత్రంతో పాటు పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెల్సిందే. 
 
ఇదిలావుంటే, కీర్తి సురేష్ ఫ్యామిలీ సైజు కూడా భారీగానే పెరిగిపోతోందట. ఫ్యామిలీ అంటే.. సొంత ఫ్యామిలీ కాదండోయ్.. ట్విట్టర్ కుటుంబం. ట్విట్టర్‌లో కీర్తి సురేష్‌ని ఫాలో అయ్యేవారి సంఖ్య ఒక్క మిలియన్‌కు చేరింది. అంటే కీర్తి ట్విట్టర్ కుటుంబ సభ్యుల సంఖ్య 10 లక్షలకు రీచ్ అయిందన్నమాట.