శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By selvi
Last Updated : బుధవారం, 8 నవంబరు 2017 (14:23 IST)

నా నగ్న ఫోటోలను పోస్టు చేస్తున్నారు.. అమ్మాలని చూస్తున్నారు.. జాగ్రత్త: సియా ఫర్లెర్

ఆస్ట్రేలియాకు చెందిన ''చీప్ థ్రిల్స్" సింగర్ సియా ఫర్లెర్ తన నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. సియాకు చెందిన 15 న్యూడ్ ఫొటోలను గుర్తుతెలియని వ్యక్తి అమ్మకానికి పెట్టినట్టు తెలుస్తోంది. సియా

ఆస్ట్రేలియాకు చెందిన ''చీప్ థ్రిల్స్" సింగర్ సియా ఫర్లెర్ తన నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. సియాకు చెందిన 15 న్యూడ్ ఫొటోలను గుర్తుతెలియని వ్యక్తి అమ్మకానికి పెట్టినట్టు తెలుస్తోంది. సియా ఫర్లెర్ తాజా క్రిస్మస్ ఆల్బమ్  విడుదలకు సిద్దమైన వేళ ఈ నగ్న ఫొటోలు ట్విట్టర్‌లో వేడి పుట్టిస్తున్నాయి.
 
ఈ నేపథ్యంలో తన ఫోటోలను అభిమానులకు అమ్మేందుకు ఓ వ్యక్తి ప్రయత్నిస్తున్నాడని తెలుసుకున్న సియా ఫర్లెర్.. అప్రమత్తంగానే తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టుచేసింది. ఇంకా తన న్యూడ్ ఫొటోగ్రాఫ్‌లను సంపాదించిన  ఓ వ్యక్తి దానిని తన అభిమానులకు అమ్మేందుకు బేరం కుదుర్చుకున్నట్టు తెలిసిందని.. అతనికి అవకాశం ఇవ్వకుండా.. తన న్యూడ్ ఫొటోలను ట్విట్టర్‌లో స్వయంగా పోస్ట్ చేసింది. 
 
ఇంకా అభిమానులకు తాను పోస్టు చేసిన ఫోటోలనే అమ్మాలని చూస్తున్నారు.. కొనుక్కోవద్దు.. డబ్బును ఆదా చేసుకోండి అంటూ సలహా ఇచ్చింది. ఇక్కడ మీకది ఉచితం. ఇక ప్రతీరోజూ క్రిస్‌మసే...అని ఫొటో కింద క్యాప్షన్ రాసింది. ఇక ప్రపంచంలో అత్యధిక సక్సెస్‌ఫుల్ సాంగ్ రైటర్స్‌లో ఒకరైన సియా.. ఇప్పటికే రిహన్నా, బేఓన్స్, క్యాటీ పెర్రీ, అడిలెలకు పాటలు రాసింది.