శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 30 అక్టోబరు 2017 (11:25 IST)

శివబాలాజీ సతీమణి మధుమితకు తప్పని వేధింపులు.. సినీ పరిశ్రమకు చెందినవాడే?

తెలుగు బిగ్ బాస్ షో విజేత శివ బాలాజీ సతీమణి మధుమితకు వేధింపులు ఎదురయ్యాయి. పలు సినిమాలు, సీరియల్స్‌లో నటించిన శివబాలాజీ భార్య మధుమితకు కూడా వేధింపులు తప్పలేదు. ఈ మేరకు శివబాలాజీ పోలీసుల్ని ఆశ్రయించాడు

తెలుగు బిగ్ బాస్ షో విజేత శివ బాలాజీ సతీమణి మధుమితకు వేధింపులు ఎదురయ్యాయి. పలు సినిమాలు, సీరియల్స్‌లో నటించిన శివబాలాజీ భార్య మధుమితకు కూడా వేధింపులు తప్పలేదు. ఈ మేరకు శివబాలాజీ పోలీసుల్ని ఆశ్రయించాడు. తన భార్యను వేధిస్తున్నట్టు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
వివరాల్లోకి వెళితే.. కొన్ని రోజుల పాటు మధుమితకు గుర్తు తెలియని వ్యక్తుల మొబైల్స్ నుంచి అసభ్యకరమైన మెసేజ్‌లు, పోస్టులు వస్తున్నాయి. ఆరంభంలో వాటిని ఆమె పట్టించుకోకుండా డిలీట్ చేశారు. తర్వాత రోజురోజుకు ఇలాంటి టెక్ట్స్ మెసేజీలు, ఫొటోలు, వీడియోల వేధింపులు ఎక్కువవ్వడంతో పోలీసుల్ని ఆశ్రయించాడు శివబాలాజీ. 
 
అతడు చెప్పిన ఫోన్ నంబర్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఐపీ అడ్రెస్ ఆధారంగా సైబర్ క్రైమ్ విభాగం నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడు సినీ  పరిశ్రమకు చెందిన వ్యక్తేనని సమాచారం. ఆ వ్యక్తి ఎవరన్న విషయం అధికారికంగా ప్రకటించలేదు.