శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 23 అక్టోబరు 2017 (11:37 IST)

అట్టహాసంగా జరిగిన కన్నడ స్టార్స్ చిరంజీవి సర్జా, హీరోయిన్ మేఘనా నిశ్చితార్థం

కన్నడ నటుడు చిరంజీవి సర్జా, హీరోయిన్ మేఘనా రాజ్‌ల నిశ్చితార్థం బెంగళూరు జేపీ నగర్‌లో సంప్రదాయబద్ధంగా జరిగింది. వైట్ అండ్ వైట్‌లో సర్జా, ఎరుపు రంగు పట్టుచీరలో మేఘన మెరిసిపోతూ ఉంగరాలు మార్చుకున్నారు. ఆప

కన్నడ నటుడు చిరంజీవి సర్జా, హీరోయిన్ మేఘనా రాజ్‌ల నిశ్చితార్థం బెంగళూరు జేపీ నగర్‌లో సంప్రదాయబద్ధంగా జరిగింది. వైట్ అండ్ వైట్‌లో సర్జా, ఎరుపు రంగు పట్టుచీరలో మేఘన మెరిసిపోతూ ఉంగరాలు మార్చుకున్నారు. ఆపై సాయంత్రం లీలా ప్యాలెస్‌లో విందు జరుగగా, గులాబీ రంగు గౌనులో మేఘన, నీలి రంగు షర్ట్‌లో సర్జా కనిపించారు. 
 
ఇకపోతే.. మేఘన తల్లిదండ్రులు సుందర్ రాజ్, ప్రమీలా కన్నడ తెరపై నటించి మెప్పించారు. హీరో అర్జున్ సర్జా సోదరి కుమారుడిగా పరిచయమైన చిరంజీవి సర్జా పలు హిట్ చిత్రాల్లో నటించారు. మేఘనతో కలిసి ఆయన నటించిన 'ఆటగార' సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక మేఘన, చిరంజీవి నిశ్చితార్థ వేడుకకు వచ్చిన అతిథులకు ఇరు కుటుంబసభ్యులు పూలహారాలతో స్వాగతం పలికారు. ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చారు.