శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 19 మే 2017 (12:04 IST)

సమంత నాకు నచ్చలేదు.. ఎందుకంటే..: నాగచైతన్య తొలి చిలిపి ఫిర్యాదు

హీరోయిన్ సమంత నాకు నచ్చలేదు అంటూ టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య చిలిపి ఫిర్యాదు చేశాడు. నిజానికి వీరిద్దరు త్వరలోనే వివాహం చేసుకోనున్నారు. వీరిద్దరికీ వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది. ఈనేపథ్యంలో సమంతలో

హీరోయిన్ సమంత నాకు నచ్చలేదు అంటూ టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య చిలిపి ఫిర్యాదు చేశాడు. నిజానికి వీరిద్దరు త్వరలోనే వివాహం చేసుకోనున్నారు. వీరిద్దరికీ వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది. ఈనేపథ్యంలో సమంతలోని ఒక్క విషయం నాకు నచ్చలేదంటూ నాగ చైతన్య చిలిపి ఫిర్యాదు చేశాడు. అందేంటో ఇపుడు పరిశీలిద్ధాం.
 
చైతూ నటించిన తాజా చిత్రం "రారండోయ్ వేడుక చూద్దాం". ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా, తనకు వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాలో పంచుకోవడం ఇష్టం ఉండదన్నాడు. అయితే సమంతను తాను కలిసిన ప్రతిసారీ విపరీతంగా ఫోటోలు తీస్తుందని చెప్పాడు. ఫోటోలు తీసినది ఊరుకుంటుందా? సోషల్ మీడియాలో పెట్టేస్తుంటుంది. దీంతో వాటిని చూసిన వారంతా తనను వాటి గురించి అడుగుతుంటారు. స్నేహితులు ఆటపట్టిస్తుంటారు. వారందరికీ నవ్వే సమాధానంగా మౌనం వహిస్తానని చెప్పాడు.
 
తను సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత చూసి నచ్చకపోయినా ఊరుకుంటానని అన్నాడు. ఇప్పుడే కదా ఇలా పెట్టేది... పెళ్లికి ముందు మధురానుభూతులను నిక్షిప్తం చేసుకుంటుందని నవ్వుకుంటానని చెప్పాడు. పెళ్లికి ముందు ఈ సెలబ్రేషన్స్, మూవ్‌మెంట్స్, ఎమోషన్స్, అటాచ్‌మెంట్ మళ్లీ మళ్లీ వచ్చేవి కాదని, జీవితకాల అనుభవాలు అని నాగచైతన్య చెప్పుకొచ్చాడు.