శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 4 జులై 2017 (18:15 IST)

స్మార్ట్ ఫోన్‌లో సెర్చ్ చేసి.. బాంద్రా వంతెన నుంచి దూకేశాడు.. ప్రేమించిన అమ్మాయికి?

తాను ప్రేమిస్తున్న ఓ అమ్మాయికి వేరొకరితో నిశ్చితార్థం అయ్యిందని తెలుసుకుని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పవన్ జీత్ కోహ్లీ (24) అనే యు

తాను ప్రేమిస్తున్న ఓ అమ్మాయికి వేరొకరితో నిశ్చితార్థం అయ్యిందని తెలుసుకుని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పవన్ జీత్ కోహ్లీ (24) అనే యువకుడు ఓ వ్యాపారవేత్త కుమారుడు. ఆ యువకుడు ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆ అమ్మాయి ఇతడిని ప్రేమిస్తుందా లేదా అనేది తెలియరాలేదు. 
 
ఇంతలో తాను ప్రేమించే అమ్మాయికి వేరొకరితో నిశ్చితార్థం కుదిరిందని తెలిసి.. ముంబైలోని బాంద్రా వర్లీ వంతెన నుంచి కిందకు దూకేశాడు. ఈ ఘటనలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే పవన్ ఆత్మహత్యపై అతడి స్నేహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
ఎప్పుడూ చలాకీగా తిరిగే వ్యక్తి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడని బాధపడుతున్నారు. పవన్‌ ఇటీవలే పుట్టినరోజు జరుపుకున్నాడని.. ఆయన తండ్రి అతనికి ఓ ఆడీ కారును కానుకగా ఇచ్చారని చెప్పుకొచ్చారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పవన్ మరణించేందుకు ముందు సులభంగా ఆత్మహత్య చేసుకోవడం ఎలా అనేదానిపై స్మార్ట్ ఫోనులో సెర్చ్ చేసినట్లు పోలీసులు చెప్తున్నారు.