శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 30 అక్టోబరు 2017 (14:43 IST)

డీఎంకే సుప్రీం కరుణ మునిమనవడితో చియాన్ విక్రమ్ కూతురి పెళ్లి (ఫోటోలు)

కోలీవుడ్ స్టార్, చియాన్ విక్రమ్ కుమార్తె వివాహం అట్టహాసంగా జరిగింది. డీఎంకే సుప్రీమ్ కరుణానిధి మునిమనవడు మను రంజిత్‌తో విక్రమ్ కుమార్తె అక్షిత వివాహం ఈరోజు ఉదయం ఘనంగా జరిగింది. తమిళనాడు మాజీముఖ్యమంత్ర

కోలీవుడ్ స్టార్, చియాన్ విక్రమ్ కుమార్తె వివాహం అట్టహాసంగా జరిగింది. డీఎంకే సుప్రీమ్ కరుణానిధి మునిమనవడు మను రంజిత్‌తో విక్రమ్ కుమార్తె అక్షిత వివాహం ఈరోజు ఉదయం ఘనంగా జరిగింది. తమిళనాడు మాజీముఖ్యమంత్రి కరుణానిధి ముని మనవడు మను రంజిత్‌తో అక్షిత వివాహం చెన్నైలో వైభవంగా జరిగింది. కోలివుడ్‌లో ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
 
రంజిత్, అక్షితలది ప్రేమ వివాహం.  కేవిన్ కేర్స్ సీకే బేకరీ ఓనర్ మను రంగనాథ్ కుమారుడు మను రంజిత్‌తో 2016 జులైలో అక్షిత నిశ్చితార్థం జరిగింది. కూతురి పెళ్లి నిమిత్తం విక్రమ్‌ కొంతకాలం షూటింగ్‌ నుంచి విరామం తీసుకున్నారు. ఇక విక్రమ్ కుమార్తె- రంజిత్ వివాహానికి.. డీఎంకే చీఫ్ కరుణానిధి పెద్దగా నిలిచారు. యువ దంపతులకు ఆశీర్వదించారు. ప్రస్తుతం అక్షిత-రంజిత్ దంపతుల ఫోటో వైరల్ అవుతోంది.  
 
ఈ వివాహం తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి స్వగృహంలో అట్టహాసంగా జరిగింది. ఇక వీరి వివాహ రిసెప్షన్ మంగళవారం (అక్టోబర్ 31) మేయర్ రామనాథన్ హాలులో జరుగనుంది.