గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 7 నవంబరు 2017 (09:20 IST)

సోషల్ మీడియాలో రేష్మా పటేల్ అశ్లీల ఫోటోలు.. వైరల్ చేసిన వ్యక్తి అరెస్ట్.. ఆమె ఎవరు?

గుజరాత్ బీజేపీ మహిళా నేత రేష్మా పటేల్ అశ్లీల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ ఫోటోలను వైరల్ చేశారనే ఆరోపణలతో ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పటీదార్ ఆరక్షణ్ మాజీ ఉద్యమక

గుజరాత్ బీజేపీ మహిళా నేత రేష్మా పటేల్ అశ్లీల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ ఫోటోలను వైరల్ చేశారనే ఆరోపణలతో ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పటీదార్ ఆరక్షణ్ మాజీ ఉద్యమకారిణి అయిన రేష్మా పటేల్‌కు ప్రస్తుతం వ్యతిరేకంగా పోరాటం జరుగుతోంది.

ఇంకా పటీదార్ ఉద్యమకారులు ప్రస్తుతం కాంగ్రెస్‌కు మద్దతు పలుకుతున్నారు. గతంలో పటీదార్ ఉద్యమంలో పనిచేసిన రేష్మా మాత్రం ఇటీవల బీజేపీలో చేరడంపై పటీదార్ ఉద్యమకారులు ఆమె పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో సనీ పటేల్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో తన అశ్లీల ఫోటోలను పోస్టు చేసి.. తన ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నాడని గుజరాత్ హైకోర్టును రేష్మా ఆశ్రయించారు. అవి తన ఫోటోలు కావని మార్ఫింగ్ చేసినవని.. దీనిపై నిజానిజాలు వెలికి తీయాలని సైబర్ క్రైమ్ పోలీసు అధికారులను గుజరాత్ హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు సనీ పటేల్‌ను అదుపులోకి తీసుకుని, విచారణ ప్రారంభించారు.