మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 1 నవంబరు 2017 (17:33 IST)

జై సింహా ఫస్ట్ లుక్.. బ్యాక్‌ గ్రౌండ్లో ఎన్టీఆర్ విగ్రహం.. (ఫోటో)

ప్రముఖ తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నందమూరి హీరో బాలకృష్ణ నటిస్తున్న తాజా సినిమా జై సింహా పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సంక్రాంతి బరిలోకి దిగుతున్న ఈ చిత్రం బాలయ్య కెరీర్‌లో 102వ సినిమా. ఇప్

ప్రముఖ తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నందమూరి హీరో బాలకృష్ణ నటిస్తున్న తాజా సినిమా జై సింహా పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సంక్రాంతి బరిలోకి దిగుతున్న ఈ చిత్రం బాలయ్య కెరీర్‌లో 102వ సినిమా. ఇప్పటికే సినిమాకు చెందిన సగం భాగం షూటింగ్ పూర్తయ్యింది. దీంతో ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను యూనిట్ నవంబర్ 1 (బుధవారం) రిలీజ్ చేశారు. 
 
ఈ లుక్‌లో బాలకృష్ణ యాక్షన్ అండ్ యాంగ్రీ లుక్‌లో వున్నాడు. ఇందులో కర్రతో ఫైటింగ్ చేస్తున్నట్లు వున్నాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఎన్టీఆర్ విగ్రహం ఉంది. ఆ వెనక ధర్నాలు చేస్తున్న ఫొటోలు ఉన్నాయి. రాజకీయ కథ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. బాలయ్య సైతం మీసాలు తిప్పి.. సింహా లుక్‌ను జై సింహాలో తలపిస్తున్నాడు.