శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr

‘రాజుగాడు’ ఫస్ట్ లుక్ : హీరోయిన్ సెల్‌ఫోన్‌ను దొంగిలిస్తున్న హీరో

టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ నటిస్తున్న తాజా చిత్రం పేరు "రాజుగాడు". ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను దీపావళి పండుగను పురస్కరించుకుని విడుదల చేశారు. సంజనారెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో రాజ్‌తరుణ్ సరసన అమైర

టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ నటిస్తున్న తాజా చిత్రం పేరు "రాజుగాడు". ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను దీపావళి పండుగను పురస్కరించుకుని విడుదల చేశారు. సంజనారెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో రాజ్‌తరుణ్ సరసన అమైరా దస్తూర్‌ నటిస్తోంది.
 
తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌ పోస్టర్‌లో హీరో రాజ్‌తరుణ్‌ హీరోయిన్ అమైరా దస్తూర్‌ హ్యాండ్‌ బ్యాగ్‌లోని సెల్‌ఫోన్‌ను దొంగిలిస్తున్నట్లు కనిపిస్తుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్‌ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావాలని ప్లాన్ చేస్తున్నారు.