బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 19 జూన్ 2017 (15:45 IST)

రాజ్ తరుణ్ ఫుడ్ లేకుండా 13 రోజులు పేవ్‌మెంట్ మీదున్నాడు... రాజారవీంద్ర

యువ హీరో రాజ్ తరుణ్ ఏదో అలా వచ్చి హీరో అయిపోయాడు కదా అని అందరూ వస్తే అవ్వరంటూ నటుడు రాజా రవీంద్ర అన్నారు. ఓ మీడియా ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ... రాజ్ తరుణ్ సినిమాల్లోకి ఓ అసిస్టెంట్ డైరెక్టరుగా వచ్చాడన్నారు. ఆయన చేస్తున్న సినిమాకు కాస్త బ్రేక్ కొట్టి త

యువ హీరో రాజ్ తరుణ్ ఏదో అలా వచ్చి హీరో అయిపోయాడు కదా అని అందరూ వస్తే అవ్వరంటూ నటుడు రాజా రవీంద్ర అన్నారు. ఓ మీడియా ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ... రాజ్ తరుణ్ సినిమాల్లోకి ఓ అసిస్టెంట్ డైరెక్టరుగా వచ్చాడన్నారు. ఆయన చేస్తున్న సినిమాకు కాస్త బ్రేక్ కొట్టి తర్వాత పిలుస్తాం వెళ్లు అనగానే రాజ్ తరుణ్ తను వుంటున్న ఇంటికి వెళ్లాడు. 
 
ఐతే ఎంతకీ పిలుపు రాకపోవడం, చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఇంటి అద్దె కట్టలేక, తినేందుకు తిండి లేక నానా అవస్థలు పడ్డాడు. చివరికి ఇల్లు ఖాళీ చేయనడంతో ఎదురుగా పేవ్ మెంట్ పైన అలా పడుకుంటూ కాలగడపాడు. ఆ తర్వాత మళ్లీ అతడి కోసం సినిమా వాళ్లు వెతుక్కుంటూ వస్తే రాజ్ తరుణ్ ఇంట్లో లేడు. 
 
ఎదురుగా వున్న పేవ్ మెంట్ పైన వుండటం చూసి పిలుచుకుని వెళ్లారు. ఆ తర్వాత అతడికి అదృష్టం కలిసి రావడం పెద్ద హీరో అవడం తెలిసిందే అంటూ చెప్పుకొచ్చారు రాజా రవీంద్ర.