మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 19 జూన్ 2017 (14:45 IST)

నిన్ను కోరిపై దర్శక ధీరుడు..ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాడట: నాని హిట్ మెషీన్ అన్న రకుల్

నేచురల్ స్టార్ నాని నిన్నుకోరి సినిమా ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సినిమాపై ఈ ట్రైలర్ అంచనాలను పెంచింది. ఆది పినిశెట్టి, నివేదా థామస్, నానిల చుట్టే తిరుగుతున్న ఈ సినిమా ట్రైయాంగి

నేచురల్ స్టార్ నాని నిన్నుకోరి సినిమా ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సినిమాపై ఈ ట్రైలర్ అంచనాలను పెంచింది. ఆది పినిశెట్టి, నివేదా థామస్, నానిల చుట్టే తిరుగుతున్న ఈ సినిమా ట్రైయాంగిల్ లవ్ ‌స్టోరీగా తెరకెక్కనుందని సమాచారం. జెంటిల్‌మెన్‌కు తర్వాత నానితో నిన్నుకోరిలో నివేదా థామస్ జతకడుతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. 
 
జూలైలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై బాహుబలి డైరక్టర్ రాజమౌళి స్పందించారు. నిన్ను కోరి సినిమా ట్రైలర్‌కి యూట్యూబ్‌లో 30లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 60వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఈ ట్రైల‌ర్ చూసిన ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి వ‌చ్చేనెల 7న విడుద‌ల కానున్న ఈ సినిమాని ఫ‌స్ట్‌డే ఫ‌స్ట్ షో చూస్తాన‌ని ట్విట్టర్లో తెలిపారు. ఈ ట్రైల‌ర్ అద్భుతంగా ఉంద‌ని పేర్కొన్నారు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శివ నిర్మాణ దర్శకత్వం వహిస్తున్నారు. 
 
ఇదే ట్రైలర్‌పై అగ్ర హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా స్పందించింది. సినీ ఇండస్ట్రీలో ఎవరి మద్దతు లేకుండా నాని సక్సెస్‌ఫుల్ యాక్టర్ అయ్యాడని కితాబిచ్చింది. ప్రేక్షకులను ఆకట్టుకోవడం.. ఫ్యాన్స్ సంఖ్యను పెంచుకోవడం సహజసిద్ధమైన నటనతోనే నేచురల్‌ స్టార్‌గా ఎదిగిపోయాడని ప్రశంసించింది. ఇదే ఊపుతో మరిన్ని సక్సెస్ ఫుల్ సినిమాలను నాని తన ఖాతాలో వేసుకోవాలని రకుల్ ప్రీత్ సింగ్ ఆశించింది.
 
నాని హిట్ మెషీన్ అంటూ కామెంట్ చేసింది. నిన్ను కోరి ద్వారా మరో హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడని చెప్పింది. కృష్ణగాడి వీర ప్రేమ కథ, మజ్ను, జెంటిల్‌మెన్ వంటి వరుస హిట్లతో దూసుకెళ్తున్న నాని తప్పకుండా నిన్ను కోరితో బంపర్ హిట్ కొడతాడని రకుల్ కామెంట్ చేసింది.