శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : శనివారం, 10 జూన్ 2017 (12:23 IST)

మా ఇద్దరి మధ్య "ఆ" లింకు ఉన్నా మీకేంటి నష్టం : హెబ్బాపటేల్

హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ హెబ్బాపటేల్‌ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందనే వార్తలు ఫిల్మ్ నగర్‌లో తరచుగా గుప్పుమంటున్నాయి. వీటిపై హెబ్బా పటేల్ స్పందిస్తూ... తామిద్దరం కలిసి నటించిన సినిమాలు హిట్ అవడం వల్ల

హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ హెబ్బాపటేల్‌ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందనే వార్తలు ఫిల్మ్ నగర్‌లో తరచుగా గుప్పుమంటున్నాయి. వీటిపై హెబ్బా పటేల్ స్పందిస్తూ... తామిద్దరం కలిసి నటించిన సినిమాలు హిట్ అవడం వల్ల, తమ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని, అంతమాత్రాన, తమ మధ్య ఏదో ఉందనే అసత్య ప్రచారాలు నమ్మవద్దని చెప్పింది. ఒకవేళ అలాంటి లింకు ఉన్న మీకు వచ్చిన నష్టమేంటని ఆమె ప్రశ్నించింది. 
 
పైగా, నిరాధారమైన వార్తలను ప్రసారం చేయడంలో మీడియా సీరియస్‌గా ఉంటుందని, కానీ తాము మాత్రం చాలా సరదాగా తీసుకుంటామని, తమ మధ్య ఉంది కేవలం స్నేహం తప్పా మరేం లేదని ఆమె క్లారిటీ ఇచ్చింది. తాను నటించిన సినిమాలను థియేటర్‌కు వెళ్లే చూస్తానని, అయితే, ఎవరికంటా పడకుండా కొంచెం జాగ్రత్త పడతానని చెప్పింది.