మంగళవారం, 28 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 11 నవంబరు 2017 (16:23 IST)

అరమ్‌తో నయనతార లేడి సూపర్ స్టార్ కావడం ఖాయమేనా?

దక్షిణాది హీరోయిన్ నయనతార లేడి సూపర్ స్టార్ కావడం ఖాయమని సినీ పండితులు అంటున్నారు. నయన తాజా సినిమా అరమ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో.. తొలి రోజే హిట్ టాక్ కొట్టేసింది. గోపీ నయనార్ తెరకెక్కించిన

దక్షిణాది హీరోయిన్ నయనతార లేడి సూపర్ స్టార్ కావడం ఖాయమని సినీ పండితులు అంటున్నారు. నయన తాజా సినిమా అరమ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో.. తొలి రోజే హిట్ టాక్ కొట్టేసింది. గోపీ నయనార్ తెరకెక్కించిన ఈ సినిమా లేడి ఓరియెంటెడ్ సినిమాగా రూపొందింది. ఈ సినిమా తెలుగులో కర్తవ్యం పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఇక తమిళ అరమ్ చిత్రంలో లేడి కలెక్టర్‌గా నయనతార అదరగొట్టేసింది. ఇంతలో ప్రజల కష్టాలను రాజకీయ నాయకుల ముందుంచి ప్రశ్నించే కలెక్టర్ పాత్రలో నయనతార నటించింది. ఈ చిత్రంలో నయనతార నట ద్వారా తప్పకుండా ఆమె లేడి సూపర్ స్టార్ అనే పేరు కొట్టేయడం ఖాయమని సినీ పండితులు అంటున్నారు. 
 
గ్రామాల్లో త్రాగునీరుతో పాటు కనీస వసతులు కల్పించాలని ప్రజల తరఫున నిలిచి పోరాడే పాత్రలో నయన యాక్టింగ్ సూపర్ అంటూ నెటిజన్లు కితాబిచ్చేస్తున్నారు. విమర్శకులు సైతం నయన నటనపట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. కథాకథనాలు, స్క్రీన్‌ప్లే, నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాల వైఖరి ఎలా వుంది. 
 
ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య కథగా స్వీకరించి ఎక్కడా బోర్ కొట్టకుండా డైరక్టర్ తెరకెక్కించాడు. తొలి అర్థభాగం పవర్ ఫుల్ సన్నివేశాలతో సాగింది. పవర్ ఫుల్ రాజకీయ వేత్తలు, పోలీసులు, డాక్టర్లున్నా.. ఒక బావిలో ప్రమాదవశాత్తు పడిపోయిన అమ్మాయిని వెలికితీసేందుకు కౌన్సిలర్లు, ప్రభుత్వ అధికారులు ఎలా వ్యవహరించారనే సన్నివేశాలు బాగున్నాయి. బావిలో పడిన యువతిని కలెక్టర్‌గా నయనతార ఎలా కాపాడింది. దీన్ని అడ్డుకున్న రాజకీయ నాయకులను ఎలా ఎదుర్కొంది అనే కథతో సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.