మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By selvi
Last Updated : శుక్రవారం, 10 నవంబరు 2017 (09:04 IST)

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య ఘటన.. రేవంత్‌కు కేసీఆర్ బర్త్ డే విషెస్ చెప్పారు..

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిన రేవంత్ రెడ్డిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెరాసలోకి ప్రవేశం లేదు, టీడీపీ త

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిన రేవంత్ రెడ్డిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెరాసలోకి ప్రవేశం లేదు, టీడీపీ తెలంగాణాలో మనుగడలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీలోకి ప్రవేశించారని నిప్పులు చెరిగారు. అయితే తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం రేవంత్ రెడ్డికి బర్త్ డే విషెస్ చెప్పారు. 
 
సందు దొరికితే ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుకునే కేసీఆర్ రేవంత్ రెడ్డిల మధ్య  జరిగిన ఈ అంశంపైనే ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి పేరు చెబితేనే విరుచుకుపడే కేసీఆర్ బర్త్ డే విషెస్ చెబుతూ ఓ లేఖతోపాటు పుష్పగుచ్చాన్ని రేవంత్‌కు పంపారు. ‘‘దేవుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి. ప్రజాసేవలో మీరు మరెన్నో ఏళ్లు కొనసాగాలి’’ అని లేఖలో పేర్కొన్నారు.
 
ఓటుకు నోటు కేసు తర్వాత టీఆర్ఎస్.. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి విభేదాలు చేరుకున్న సంగతి తెలిసిందే. కేసీఆర్‌పై, తెరాస నేతలపై రేవంత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే ఇప్పుడు వీటన్నింటినీ మనసులో పెట్టుకోకుండా కేసీఆర్ బుధవారం రేవంత్‌కు బర్త్ డే శుభాకాంక్షలు చెబుతూ పుష్పగుచ్చాన్ని పంపడం తెరాస నేతలను ఆశ్చర్యంలో ముంచెత్తింది.