శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 7 నవంబరు 2017 (13:40 IST)

#maiamwhistle యాప్‌ను విడుదల చేసిన కమల్ హాసన్.. రాజకీయాల్లోకి వచ్చేశా..

ప్రజా సమస్యలపై హ్యాష్‌టాగ్‌ను ఉపయోగించవచ్చునని.. ఆ హ్యాష్‌టాగ్ ద్వారా ప్రజా సమస్యలపై మాట్లాడవచ్చునని.. చివరికి తాను రాజకీయాల్లోకి వచ్చి.. తనలో ఏవైనా లోతుపాట్లను కనుగొన్నా అందులో తెలియజేసే సౌలభ్యం వుంద

సినీ లెజెండ్ కమల్ హాసన్ రాజకీయ ప్రవేశానికి సర్వం సిద్ధమైంది. తమిళనాట మరో రాజకీయ పార్టీ పుట్టేందుకు సమయం వచ్చిందని... బర్తే డే రోజున కమల్ ప్రకటించారు. అయితే తాను రాజకీయ పార్టీపై ప్రకటన చేయట్లేదని.. గర్భం దాల్చిన వెంటనే పుట్టే బిడ్డకు పేరు కావాలని అడిగినట్లు కాకుండా రాజకీయ పార్టీ కోసం అధ్యయనం జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల్లో వచ్చేశానని.. అయితే పార్టీ పేరు ఇతరత్రా అంశాలను సిద్ధం చేసుకుంటున్నానని.. ఇందు కోసం ప్రజల కోసం రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల్సి వుందన్నారు.
 
ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వీలుగా కమల్ హాసన్ చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ యాప్‌ను కూడా ప్రకటించారు. తమిళనాడును ఇన్నాళ్ల పాటు తిప్పిన చక్రాలు పాతబడిపోయాయని భావిస్తున్నానని కమల్ వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై హ్యాష్‌టాగ్‌ను ఉపయోగించవచ్చునని.. ఆ హ్యాష్‌టాగ్ ద్వారా ప్రజా సమస్యలపై మాట్లాడవచ్చునని.. చివరికి తాను రాజకీయాల్లోకి వచ్చి.. తనలో ఏవైనా లోతుపాట్లను కనుగొన్నా అందులో తెలియజేసే సౌలభ్యం వుందని కమల్ హాసన్ తెలిపారు. ప్రజలతో కలిసి ప్రజా సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని.. #maiamwhistle అనే యాప్‌ను విడుదల చేశారు.