మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 31 ఆగస్టు 2018 (12:51 IST)

భర్తపై చంపేసినట్టుగా తండ్రితో హత్య కేసు పెట్టించి... ప్రియుడితో కలిసి ఢిల్లీ చెక్కేసి...

ఓ మహిళ తన ప్రియుడుతో లేచిపోయేందుకు ఆడిన నాటకం పోలీసులనే విస్తుపోయేలా చేసింది. తనను అల్లుడే చంపేసినట్టుగా కన్నతండ్రితో కేసుపెట్టించింది. ఆ తర్వాత తన ప్రియుడుతో కలిసి లేచిపోయింది. ఫిరోజాబాద్‌లోని బారాబం

ఓ మహిళ తన ప్రియుడుతో లేచిపోయేందుకు ఆడిన నాటకం పోలీసులనే విస్తుపోయేలా చేసింది. తనను అల్లుడే చంపేసినట్టుగా కన్నతండ్రితో కేసుపెట్టించింది. ఆ తర్వాత తన ప్రియుడుతో కలిసి లేచిపోయింది. ఫిరోజాబాద్‌లోని బారాబంకీలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
బారాబంకీ ప్రాంతానికి చెందిన రూబీ అనే వివాహితకు అదే ప్రాంతానికి చెందిన రాహుల్ అనే వ్యక్తితో గత 2016 జనవరి నెలలో వివాహమైంది. 2018లో తన కూతురు రూబీని అల్లుడైన రాహుల్, ఆమె అత్తమామలు రామ్ హర్ష్, బార్కీలు కట్నం కోసం హతమార్చారని రూబీ తండ్రి హరిప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, హరిప్రసాద్ ఫిర్యాదులో ఆధారాలు లేకపోవడంతో పోలీసులు పట్టించుకోలేదు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించాడు. 
 
కోర్టు ఆదేశంతో ఈ ఏడాది జులైలో కట్నం కోసం రూబీని ఆమె భర్త రాహుల్ హతమార్చాడని పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు రూబీ శవం మాత్రం లభించలేదు. రూబీ శవం లభించక పోవడంతో పోలీసులు అనుమానంతో రూబీ ఫేస్‌బుక్, ఆమె ఫోన్లపై నిఘా వేశారు. ఈ నిఘాలో అసలు గుట్టు బయటపడింది.
 
రూబీ తన ప్రియుడైన రామూను వివాహం చేసుకొని, అతనితో ఢిల్లీలో నివాసముంటున్నట్లు ఫేస్‌బుక్, ఫోన్ ద్వారా పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసులు ఢిల్లీ వెళ్లి రూబీ, రామూలను అరెస్టు చేసి తీసుకువచ్చారు. హత్య జరగకుండానే కోర్టును తప్పు దారి పట్టించేలా హత్యకు గురైనట్లు చిత్రీకరించి, ప్రియుడిని పెళ్లాడిన వివాహిత బాగోతంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. రూబీ భర్త రాహుల్‌పై పెట్టిన కేసును ఎత్తివేశారు.