శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 29 ఆగస్టు 2018 (15:59 IST)

స్త్రీలు బయట ప్రదేశాల్లో స్నానం చేయకూడదా.. శ్రీకృష్ణుడు అందుకే?

శ్రీకృష్ణ లీలల్లో ఓ అర్థం, సందేశం దాగివుంది. అందుకే దశావతారాల్లో ఒకటైన శ్రీకృష్ణావతారంలో మానవ ధర్మాలను చెప్పారు. ఇంకా శ్రీకృష్ణుడు తన లీలల ద్వారా కూడా లోకానికి సందేశాన్నిచ్చారని ఆధ్యాత్మిక నిపుణులు చె

శ్రీకృష్ణ లీలల్లో ఓ అర్థం, సందేశం దాగివుంది. అందుకే దశావతారాల్లో ఒకటైన శ్రీకృష్ణావతారంలో మానవ ధర్మాలను చెప్పారు. ఇంకా శ్రీకృష్ణుడు తన లీలల ద్వారా కూడా లోకానికి సందేశాన్నిచ్చారని ఆధ్యాత్మిక నిపుణులు చెప్తుంటారు. ఆ లీలల్లో ఒకటైన గోపిక దుస్తులను దొంగలించడం వెనుక వేరొక అర్థముందని వారు చెప్తుంటారు. 
 
స్త్రీలు బయలు ప్రదేశాల్లో దుస్తులు లేకుండా స్నానం చేయకూడదని.. పొన్చెట్టు పైకి చీరలను ఎత్తుకెళ్లి గుణపాఠం నేర్పాడు. ఇంకా తన మామగారైన కంసుని రాజ్యానికి సహకారం అందకూడదనే ఉద్దేశంతో పాలు పెరుగు తీసుకుని వెళ్లే గొల్లభామల తలలపై ఉండే కుండలను రాళ్ళతో చిల్లు కొట్టాడు. అలాగే పేదవారైన మిత్రులందరిని రాత్రిపూట వెంట తీసుకుని వెళ్లి సంపన్న కుటుంబాలలో వెన్నను తినిపించాడు. 
 
బాల్య మిత్రులందరిని చైతన్యవంతంగా ఆటలాడిస్తూ.. వారందరిని సైనికులుగా మార్చాడు. కాళీయ మర్దనం ద్వారా కాళీయుడిని అహంకారాన్ని అణచి వేయడం మాత్రమే కాకుండా ప్రజల్లో విశ్వాసాన్ని నిర్మాణం చేశాడు.
 
భూదేవికి మానవులు చేసే పాపాల భారం భరించడం సాధ్యం కాలేదు. మనుషులు చేసిన పాపాల వలన మొక్కలు, జంతువులు, నీరు, గాలి, భూమి నాశనం అవుతున్నాయి. భూదేవి విష్ణువు దగ్గరకు వెళ్లి తనను కాపాడమని వేడుకుంది. అప్పుడే శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతారమెత్తాడు.