సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 28 ఆగస్టు 2018 (14:23 IST)

కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని మోసం చేసింది.. కత్తితో పీకకోసి చంపేశా...

కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని మోసం చేసిన ఓ మహిళను ఓ యువకుడు కత్తితో పీకకోసి చంపేశాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. కాకినాడ సమీపంలోని అల్లవరం మండలంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...

కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని మోసం చేసిన ఓ మహిళను ఓ యువకుడు కత్తితో పీకకోసి చంపేశాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. కాకినాడ సమీపంలోని అల్లవరం మండలంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
మండలంలోని ఓడలరేవులకు చెందిన దుర్గాప్రసాద్ అనే యువకుడు దుబాయ్‌లో పని చేస్తున్నాడు. ఈ యువకుడు స్థానికంగా ఉండే పొనమండ కృష్ణకుమారి(45) అనే మహిళ కుమార్తెను ప్రేమించాడు. ఈ విషయం కృష్ణకుమారికి చెప్పాడు. పైగా, దుర్గా ప్రసాద్ దుబాయ్‌లో పని చేస్తూ నాలుగు పైసలు సంపాదిస్తుండటతో కృష్ణకుమారి కూడా సమ్మతించింది. ఆ తర్వాత దుబాయ్ నుంచి కృష్ణకుమారికి దుర్గా ప్రసాద్ పలుమార్లు డబ్బులు కూడా పంపించాడు. 
 
ఈ నేపథ్యంలో ఇటీవల స్వదేశానికి తిరిగివచ్చిన దుర్గాప్రసాద్.. పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిని ఇవ్వాలని కృష్ణకుమారి వద్దకు వెళ్లి అడిగాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో కృష్ణకుమారిపై దుర్గాప్రసాద్ కోపం పెంచుకున్నాడు. అదునుకోసం వేచిచూసి మంగళవారం ఉదయం కత్తితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. అలాగే పీకకోయడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.