సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 26 ఆగస్టు 2018 (15:20 IST)

చపాతి కూరలో 30 నిద్రమాత్రలు కలిపి.... మెడకు చీర బిగించి...

విజయనగరం జిల్లాలో తన అక్రమ సంబంధాన్ని అడ్డొస్తున్నాడనీ కన్నబిడ్డను కసాయి తల్లి హత్య చేసింది. ఈ కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. చపాతి కూరలో 30 నిద్రమాతలు కలిపి, మెడకు చీరను బిగించి హత్య చేసిందాత

విజయనగరం జిల్లాలో తన అక్రమ సంబంధాన్ని అడ్డొస్తున్నాడనీ కన్నబిడ్డను కసాయి తల్లి హత్య చేసింది. ఈ కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. చపాతి కూరలో 30 నిద్రమాతలు కలిపి, మెడకు చీరను బిగించి హత్య చేసిందాతల్లి. ఇందుకు ఆమె ప్రియుడు పూర్తి సహాయ సహకారాలు అదించినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, విజయనగరం టౌన్‌ గాయత్రీనగర్‌లో నివాసముంటున్న వెంకట పద్మావతి అనే మహిళకు 2000లో కొండబాబు అనే వ్యక్తితో వివాహమైంది. భార్యాభర్తల మధ్య ఏర్పిడన మనస్పర్థల కారణంగా విడిపోయారు. వీరికి హరిభగవాన్‌ (17)తో పాటు ఓ కుమార్తె కూడా ఉంది. 
 
ఈ క్రమంలో పద్మావతి గాయత్రీనగర్‌లోని తన సొంతింటిలో పిన్ని సీతాలక్ష్మి, పిల్లలతో నివాసముంటూ, కొన్ని ప్రైవేట్‌ సంస్థలకు ఏజెంట్‌గా పనిచేస్తోంది. ఈ పరిస్థితుల్లో గోవింద్‌ అనే రియల్టర్‌తో ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. తన తల్లి వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటం చూసి సహించని కుమారుడు హరిభగవాన్‌ తల్లిని పలుమార్లు హెచ్చరించాడు. దీంతో కన్నబిడ్డ అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసింది. 
 
తన ప్రియుడు గోవింద్‌తో కలిసి చపాతీ కూరలో 30 నిద్రమాతలు కలిపింది. ఈ విషయం తెలియని హరిభగవాన్ చపాతీలతో పాటు.. ఆ కూరను ఆరగించడంతో అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. నిద్రలోకి జారుకున్న కొడుకు మెడకు చీర బిగించి హత్యచేసింది. అనంతరం ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్లు చిత్రీకరించి, మార్కులు తక్కువగా రావడంతో తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు అందరినీ నమ్మించింది. 
 
గురువారం ఉదయం ఇంటికి వచ్చిన పద్మావతి పిన్ని సీతాలక్ష్మికి హరి ఆత్మహత్య చేసుకున్నాడని తెలియడంతో ఆశ్చర్యపోయింది. పద్మావతిని గట్టిగా నిలదీయడంతో చేసిన తప్పు ఒప్పుకుని పోలీసులకు లొంగిపోయింది. ఇదిలావుంటే, హత్యకు పరోక్షంగా సహకరించినా గోవింద్‌ను శుక్రవారం స్థానిక రైల్వే స్టేషన్‌ వద్ద రూరల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో వీరిద్దరిని రిమాండ్‌ నిమిత్తం సబ్‌జైల్‌కు తరలించారు.