సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 26 ఆగస్టు 2018 (09:44 IST)

తాగొచ్చి వక్షోజాలు పట్టుకున్నాడనీ తండ్రిని చంపేసిన కుమార్తె...

తమ కన్నబిడ్డలను కడదాకా కంటికి రెప్పలా కాపాడాల్సిన కొందరు తండ్రులు మానవ మృగాలుగా తయారవుతున్నారు. తమ కామకోర్కెలు తీర్చుకునేందుకు సొంత కూతురన్న విషయాన్ని కూడా మరచిపోయి.. అత్యంత కిరాతకంగా ప్రవర్తిస్తున్నా

తమ కన్నబిడ్డలను కడదాకా కంటికి రెప్పలా కాపాడాల్సిన కొందరు తండ్రులు మానవ మృగాలుగా తయారవుతున్నారు. తమ కామకోర్కెలు తీర్చుకునేందుకు సొంత కూతురన్న విషయాన్ని కూడా మరచిపోయి.. అత్యంత కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి కేసుల్లో కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ యువతి.. కన్నతండ్రిని చంపేసింది. పీకలవరకు మద్యం సేవించివచ్చి కోర్కె తీర్చాలంటూ వక్షోజాలు పట్టుకున్నాడనీ బండరాయితో మోది చంపేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
చిత్తూరు జిల్లా పుంగనూరులోని మేలుపట్ల గ్రామానికి చెందిన షేక్‌బాబుబాషా (48) అనేకి భర్య చనిపోయింది. కానీ కుమార్తె నగీన, కుమారుడు సిద్దిక్‌ ఉన్నారు. నగీన టీటీసీ చదువుతోంది. కుమారుడు ఆరో తరగతి చదువుతున్నాడు. మద్యానికి బానిసైన షేక్‌బాబుబాషా మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవ పడేవాడు. కుటుంబ సభ్యులను కొట్టడం, ఇంట్లో వస్తువులు అమ్మేసి ఆ డబ్బుతో మద్యం తాగేవాడు.
 
పలుమార్లు చెప్పిన బాబుబాషా ప్రవర్తనలో మార్పు రాలేదు. గురువారం రాత్రి మద్యం మత్తులో కుటుంబ సభ్యులతో తీవ్రంగా గొడవపడ్డాడు. ఆ తర్వాత కోర్కె తీర్చాలంటూ నగీనను వేధించాడు. ఆమెను గట్టిగా కౌగిలించుకుని చిత్ర హింసలకు గురిచేశాడు. దీంతో విసిగిపోయిన నగీన పెద్ద బండరాయిని తీసుకుని తండ్రి తలపై మోదింది. దీంతో బాబూబాషా అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితురాలు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.