శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By srinivas
Last Modified: శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (15:34 IST)

షాకింగ్ - ప‌వ‌న్ న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అజ్ఞాత‌వాసి సినిమా డిజాస్ట‌ర్ అవ్వ‌డం... ఆయ‌న ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నుకోవ‌డం.. త‌దిత‌ర కార‌ణాల వ‌ల‌న సినిమాల‌కు గుడ్ బై చెప్పేసి ఫుల్ టైమ్ పొలిటిష‌య‌న్‌గా మారిపోయారు. జ‌న‌సేన పార్టీ కార్య‌క్ర‌మాల్లో ఫుల్ బిజీ అయ్యారు. ఇ

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అజ్ఞాత‌వాసి సినిమా డిజాస్ట‌ర్ అవ్వ‌డం... ఆయ‌న ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నుకోవ‌డం.. త‌దిత‌ర కార‌ణాల వ‌ల‌న సినిమాల‌కు గుడ్ బై చెప్పేసి ఫుల్ టైమ్ పొలిటిష‌య‌న్‌గా మారిపోయారు. జ‌న‌సేన పార్టీ కార్య‌క్ర‌మాల్లో ఫుల్ బిజీ అయ్యారు. ఇక సినిమాల‌కు నిజంగానే గుడ్ బై చెప్పేసారు అనుకున్నారు. అయితే... ఇటీవ‌ల బ‌య‌ట‌కు వ‌చ్చిన ఓ వార్త ప‌వ‌న్ అభిమానుల‌కు ఆనందం క‌లిగిస్తోంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే... ప‌వ‌న్ ఓ సినిమాలో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌.
 
ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఇదే హాట్ టాపిక్. ఇంత‌కీ ఏ సినిమాలో అంటే... ప‌వ‌న్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ఓ సినిమా ప్లాన్ జ‌రుగుతోంది. ఈ చిత్రాన్ని తాళ్లూరి రామ్ నిర్మించ‌నున్నారు. ఈయ‌న‌కి ప‌వ‌న్‌కి మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ఆ కార‌ణం వ‌ల‌నే తాళ్లూరి రామ్ నిర్మించిన నేల టిక్కెట్ ఆడియో ఫంక్ష‌న్‌కి గెస్ట్‌గా వ‌చ్చాడు ప‌వ‌న్. 
 
సాయిధరమ్ తేజ్ తమ్ముడు నటిస్తున్న చిత్రంలో ప‌వ‌న్ ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో క‌నిపిస్తాడ‌ట‌. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లో అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేస్తార‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రి... ఇది నిజ‌మో కాదు తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.