శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : శుక్రవారం, 16 నవంబరు 2018 (15:10 IST)

భార్యను అలా తృప్తి పరచలేకపోతే...? సొరకాయ గింజలు తింటేనా?

చాలామంది పురుషులు లైంగిక సమస్యలతో బాధపడుతుంటారు. ఫలితంగా పడక గదిలో భార్యను సంతృప్తిపరచలేక నిరుత్సాహ పడుతుంటారు. ఇలాంటి వారు సొరకాయ ముదురు గింజలను ఆరగిస్తే మంచిదని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. 
 
సాధారణంగా సొరకాయను కూరగా చేసుకుని ఆరగిస్తుంటారు. తరచుగా తింటే జలుబు చేస్తుందని భయపడుతుంటారు. ఇలాంటివారు శొంఠి లేదా మిరియాల పొడిని కాస్తంత కలుపుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది.
 
అలాగే, వీర్యవృద్ధితో పాటు శృంగార శక్తిని కలిగించడంలో సొరకాయ గింజలు కీలక పాత్రను పోషిస్తాయి. సొరకాయ ముదురు గింజలు వేయించి, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాలు, జీలకర్ర కలిపి నూరి కొంచెం అన్నంలో కలిపి తీసుకుంటే ఆ శక్తి పెరుగుతందని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.