సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By
Last Updated : మంగళవారం, 13 నవంబరు 2018 (16:52 IST)

ఆరోగ్య సిరి.. ఉసిరి : అందం రెట్టింపు.. శృంగార సామర్థ్యం వృద్ధి

ప్రకృతి ప్రసాదించిన కాయల్లో ఉసిరిక్కాయలు ఒకటి. వీటిలో పోషకాలు మెండు. ఔషధ గుణాలు మెండుగా ఉండే ఉసిరి ఆరోగ్య సిరిగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా, అందాన్ని రెట్టింపు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే, ఆయుర్వేద వైద్యంలో ఉసిరి ఒక దివ్య ఔషధంగా పని చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి ఉసిరి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో పరిశీలిద్ధాం. 
 
* లైంగిక సామర్థ్యాన్ని, వీర్య సమృద్ధికి ఉసిరి ఎంతగానో తోడ్పడుతుంది. 
* ఉసిరి కాలేయ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలను తొలగిస్తుంది. 
* ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉసిరి పొడిని తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక దగ్గు, అలర్జీ, ఆస్తమా, టీబీ వంటి సమస్యలు తగ్గిపోతాయి. 
 
* మెదడు పనితీరును మెరుగు పరిచి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. 
* మహిళల్లో బహిష్టు సమస్యల్ని తొలిగించి సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది. 
* కఫ దోషాల్ని నివారించి.. ఊపిరితిత్తుల సమస్యల్ని తగ్గిస్తుంది. మలబద్దకానికీ మంచి మందు. 
* వెంట్రుకల సంరక్షణకు ఎంతో మేలు చేస్తుంది. దీంతో చేసే షాంపూలూ, నూనెలూ జుట్టుకు ఎంతో మంచి చేస్తాయి. 
 
* చుండ్రు, తెల్లని జుట్టును నల్లగా మార్చడంలో ఇది బాగా పనిచేస్తుంది. 
* కొన్ని రకాల క్యాన్సర్లను సైతం తగ్గించగల గుణాలు ఉసిరిలో మెండుగా ఉన్నాయి. 
* ఎండ వేడిమి నుంచి చర్మ రోగాల నుంచి కాపాడి చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. 
* ఉసిరి రోజు తింటే కాల్షియం పెరిగి ఎముకలు, దంతాలు, గోళ్లూ, వెంట్రుకలూ ఆరోగ్యంగా పెరుగుతాయి.