శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : గురువారం, 1 నవంబరు 2018 (13:33 IST)

ఉసిరికాయను నూనెలో వేయించి తీసుకుంటే..?

ఈ సీజన్‌లో ఉసిరికాయలు ఎక్కువగా లభిస్తాయి. చలికాలం అంటేనే చాలామందికి దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస కోశ సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్యలు ఉసిరికాయ చక్కని ఔషధంగా పనిచేస్తుంది. మరి ఉసిరిలోని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం..
 
ఉసిరిలో నీరు, పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇవి జీర్ణశక్తిని పెంచుటకు సహాయపడుతాయి. దాంతో పాటు అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను కూడా తొలిగిస్తాయి. ఉసిరిలోని విటమిన్ సి కడుపులోని మంటను, పుండ్లను తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. అంతేకాకుండా కండారాలకు బలాన్ని చేకూర్చుతుంది.
 
గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది.. రక్తనాళాల గోడలు దృఢంగా మారకుండా కాపాడుతుంది. శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉసిరి కాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని నూనెలో బాగా వేయించి అందులో కొద్దిగా ఉప్పు, కారం, చింతపండు గుజ్జు వేసి కాసేపు ఉడికించి వేడివేడి అన్నంలో కలిపి తీసుకోవాలి...
 
ఇలా రోజూ తీసుకున్నట్లైతే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. దాంతో ఎర్రరక్తకణాలను వృద్ధి చేసి, రక్తాన్ని శుద్ధి చేస్తాయి. గొంతునొప్పిగా ఉన్నప్పుడు.. ఉసిరి రసంలో కొద్దిగా అల్లం రసం, తేనె, ఉప్పు కలిపి సేవిస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. అలానే రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గించే ఔషధ గుణాలు ఉసిరి ఉన్నాయి. మధుమేహ వ్యాధి గలవారు రోజు ఉసిరి జ్యూస్ తీసుకుంటే వ్యాధి అదుపులో ఉంటుంది.