శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 31 అక్టోబరు 2018 (16:46 IST)

గోరువెచ్చని వేడినీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?

తిన్న ఆహారం జీర్ణం కాలేదనగానే భయంతో.. మందులు తెచ్చుకోవడానికి వెళ్తుంటారు. కానీ, ఈ చిన్న విషయానికే మందులు వాడడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనుక ప్రతిరోజూ వేడి నీళ్లు తాగడం ద్వారానే ఆ జీర్ణశక్తి మెరుగుపడుతుందని వారు చెప్తున్నారు.
 
వేడినీళ్లు తీసుకోవడం వలన ఆకలి వేస్తుంది.. మల విసర్జన సాఫీగా జరుగుతుంది. అలానే కడుపు ఉబ్బరం, ఎక్కిళ్లు, జలుబు, దగ్గు, ఆయాసం వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. తలనొప్పి అధికంగా ఉన్నప్పుడు వేడినీళ్లతో స్నానం చేయాలి. దాంతో తలనొప్పి నుండి వెంటనే ఉపశమనం లభిస్తుంది. రాత్రి నిద్రకు ముందుగా వేడినీళ్లు సేవిస్తే వాతం, కఫం, ఆమదోషం హరిస్తాయి. తద్వారా తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది.
 
కాచిన నీరు వేడిగా ఉన్నాయని వాటిలో చల్లని నీరు పోస్తే.. శ్లేష్మ వాతాలు పెరిగిపోయి శరీరానికి హాని జరిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మధుమేహ వ్యాధితో బాధపడేవారు వేడినీళ్లు సేవించడం వలవ షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. దాంతో క్లోమగ్రంధి పనితీరు కూడా మెరుగుపడుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు చక్కగా ఉంటుంది. రోజూ వేడినీళ్లు తాగడం వలన అధిక బరువు కూడా తగ్గుతారని నిపుణులు చెప్తున్నారు.