సోమవారం, 27 జనవరి 2025
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 29 అక్టోబరు 2018 (12:37 IST)

పిల్లల కడుపులో నులిపురుగుల్ని తరిమి కొట్టే కొబ్బరి పాలు..

పిల్లలు సరైన సమయానికి ఆహారం తీసుకోవట్లేదా..? ఆకలి కాలేదని చెప్తున్నారా..? అయితే కడుపులో నులిపురుగులు వున్నాయోమోనని గమనించాలి. ముఖ్యంగా వర్షాకాలంలో వేధించే నులిపురుగుల సమస్యను దూరం చేసుకోవాలంటే.. ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
ప్రతీరోజూ కాచి, చల్లార్చిన నీటినే పిల్లలకు తాగిస్తుండాలి. అపరిశుభ్రమైన ప్రాంతాల్లో ఆహారం తినకోకూడదు. పండ్లు, కూరగాయలను పరిశుభ్రంగా కడిగిన తరువాతే వినియోగించాలి. మాంసాహారంలో శుభ్రత పాటించాలి. గోళ్లు కొరికే అలవాటును మాన్పించాలి. 
 
ఇంట్లో ఒకరికి కడుపులో నులిపురుగులుంటే మిగిలిన కుటుంబసభ్యులు కూడా చికిత్స తీసుకోవాలి. ఆహారం తినే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారం తీసుకునే ముందు చేతులు కడుక్కోవాలి. త్రిఫల చూర్ణాన్ని రోజూ పిల్లలకు పావు స్పూన్ తేనెతో కలిపి ఇవ్వాలి. ఇలా ఐదు రోజులు చేస్తే నులిపురుగులు దూరమవుతాయి. 
 
అలాగే క్యారెట్‌ తురుమును వరుసగా వారం రోజులపాటు నాలుగు చెంచాలు తినిపించాలి. ఇలాచేస్తే కడుపులో నులిపురుగులు దూరమవుతాయి. అలాగే కొబ్బరి తురుమును పిల్లల వయసును బట్టి మూడు లేదా నాలుగు చెంచాలు తినిపించి రెండు గంటల తరువాత పావుచెంచా లేదా అరచెంచా గోరువెచ్చని ఆముదాన్ని తాగించాలి. ఇలా చేస్తే నులిపురుగులు నశిస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.