అజీర్తి సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి..?
కొందరికి అజీర్తి వలన కడుపునొప్పి, కడుపు మంట, వాంతులు రావడం వంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అజీర్తి తొలగించడానికి టానిక్‌లు, మందులు వాడుతుంటారు. అయినా కూడా ఎటువంటి ఫలితం కనిపించదు. కనుక ఈ చిట్కాలు పాటిస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది.. మరి అవేంటో తెలుసుకుందాం...
బొప్పాయి ఆరోగ్యానికి ఎంత మంచిదో వాటి గింజలు ఆరోగ్యానికి అంత మంచివి. ఎలా అంటే.. బొప్పాయి గింజలను ఎండబెట్టి పొడిచేసుకుని ఈ పొడిని పైనాపిల్ ముక్కలపై చల్లుకుని ప్రతిరోజూ ఉదయాన్నే సేవిస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. అలానే ఆకుపచ్చని యాలకులు, సోంపు గింజలు దాల్చిన చెక్కలను నూనెలో బాగా వేయించుకోవాలి.
ఆ తరువాత వాటిని పొడిచేసుకోవాలి. ఈ పొడిని రోజూ వేడివేడి అన్నంలో కలుపుకుని తీసుకుంటే అజీర్తి సమస్య తొలగిపోతుంది. అల్లం ఆరోగ్యానికి ఔషధం. కనుక అల్లాన్ని మెత్తగా నూరుకుని అందులో కొద్దిగా ఉల్లిపాయ రసాన్ని వేసి, కొన్ని నీళ్ళు పోసి కాసేపు మరిగించుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజు రెండుపూటలా తీసుకుంటే అజీర్తి తగ్గుతుంది.
రోజూ మీరు తీసుకునే ఆహారంలో బీన్స్, కాఫీ, టీ, నిమ్మ, ఆరెంజ్ జ్యూస్ వంటివి ఉండేలా చూచుకోవాలి. అప్పుడే అజీర్తి సమస్య రాదు. కడుపులో చెడు పదార్థాలు అధికంగా ఉన్నా కూడా కడుపులో మంటగా ఉంటుంది. అందువలన ఉదయాన్నే ఇలా చేస్తే.. మంచి ఉపశమనం లభిస్తుంది. నల్లజీలకర్రలో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే కడుపులోని మంట తగ్గుతుంది. దాంతో అజీర్తి సమస్య కూడా తొలగిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.