మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By
Last Updated : శనివారం, 27 అక్టోబరు 2018 (18:42 IST)

పొన్నగంటి ఆకు, మిరియాల పొడితో కూర చేసుకుని తీసుకుంటే..?

గంటల కొద్ది కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసేవారికి కంటి కిందట నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి. దాంతో కళ్లు దురదగా, మంటగా ఉంటాయి. అందువలన ప్రతిరోజూ గంట ఓసారి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. అప్పుడే అలసట, ఒత్తిడి తొలగుతుంది. దాంతో కళ్ల దురదలు తగ్గుతాయి. 
 
పొన్నగంటి ఆకును ఉడికించుకుని అందులో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి చేర్చి తీసుకుంటే కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. పొన్నగంటి ఆకుతో తాలింపు తయారుచేసి ప్రతిరోజూ సేవిస్తే నోటి దుర్వాసన పోతుంది. అంతేకాకుండా మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అధిక బరువు తగ్గాలనుకునే వారు పొన్నగంటి ఆకు, కందిపప్పు బాగా ఉడికించుకుని అందులో కొద్దిగా నెయ్యి, ఉప్పు, పచ్చిమిర్చి, చింతపండు వేసి మరికాసేపు ఉడికించి సేవిస్తే నెలరోజుల్లో స్లిమ్‌గా మారుతారు.
 
ప్రస్తుత కాలంలో మనం తీసుకునే ఆహారాల్లో, పీల్చుకునే గాలిలో రసాయనాలు ఉండడంతో అవి రక్తంలో కలిసిపోతున్నాయి. దాంతో రక్తం అశుభ్రమైపోతుంది. పొన్నగంటి కూర తింటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. పొన్నగంటి ఆకు, పెసరప్పు బాగా ఉడికించుకోవాలి. ఆ తరువాత నూనెలో ఉల్లిపాయలు, జీలకర్ర, వెల్లుల్లి, మిరియాల పొడి వేసి వేయించి పొన్నగంటి ఆకులో వేసి కాసేపు ఉడికించుకోవాలి. ఈ కూరను అన్నంలో కలిపి తీసుకుంటే దాని రుచే వేరు.