అఖిల్ హీరోగా రామ్ చరణ్ నిర్మిస్తున్న చిత్రమా...?
అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం మిస్టర్ మజ్ను. ఈ చిత్రానికి తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అఖిల్ సరసన నిధి అగర్వాల్ నటిస్తుంది. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్‌లో అఖిల్‌పై ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరించారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. అయితే... ఈ సినిమా తర్వాత ఏ సినిమా చేయనున్నాడు అనేది ఆసక్తిగా మారింది.
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. అఖిల్ నాలుగవ చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయనున్నాడని. ఆల్రెడీ బోయపాటి కథ చెప్పడం.. అఖిల్ ఓకే చెప్పడం జరిగిందని సమాచారం. అఖిల్ - బోయపాటి కాంబినేషన్లో రూపొందే చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పైన రామ్ చరణ్ నిర్మించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ బోయపాటి డైరెక్షన్లో వినయ విధేయ రామ చిత్రం చేస్తున్నాడు. ఈ షూటింగ్‌లో ఉండగానే బోయపాటి అఖిల్‌కి కథ చెప్పాడని తెలిసి రామ్ చరణ్ ఆ సినిమాని తనే నిర్మిస్తానని చెప్పాడట.
అఖిల్‌ని మాస్ హీరోగా చూడాలని ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. ఇక ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి అఖిల్ సినిమాకి డైరెక్టర్ అయితే ఇక అభిమానులకు పండగే. మరి.. ప్రచారంలో ఉన్నది నిజమో కాదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.