శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 10 డిశెంబరు 2018 (13:29 IST)

"వీవీఆర్‌"లో చెర్రీతో కలిసి మెగాస్టార్ డాన్స్

దర్శకుడు బోయపాటి శ్రీను, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం "వినయ విధేయ రామ". ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పక్కా మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌, టీజర్‌ను ఇప్పటికే రిలీజ్ చేయగా, అవి ఎంతగానే ప్రేక్షకులను ఆకర్షించాయి. 
 
ఈనేపథ్యంలో మెగా ఫ్యాన్స్‌కు చెర్రీ ఓ శుభవార్త చెప్పారు. ఈ చిత్రంలోని ఓ ప్రత్యేక గీతంలో చెర్రీతో కలిసి మెగాస్టార్ చిరంజీవి డాన్స్ చేయనున్నారట. ఈ పాట చిత్రీకరణ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోందట. మొత్తం 4.30 నిమిషాల నిడివి కలిగిన ఈ పాటను రెండు రోజుల పాటు చిత్రీకరించగా, ఈ రెండు రోజులూ తనయుడు చెర్రీతో కలిసి షూటింగ్‌లో పాల్గొన్నాడట. మరి ఈ పాటలో చెర్రీ తండ్రి ధీటుగా డాన్స్ వేశాడా? లేదా? అన్నది వేచిచూడాల్సిందే. 
 
ఇదిలావుంటే ఈ చిత్రం ప్రిరిలీజ్ వేడుక ఈనెల 27వ తేదీన యూసుఫ్ గూడ‌లోని పోలీస్‌ గ్రౌండ్స్‌లో జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మెగాస్టార్ చిరంజీవితో పాటు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా హాజరుకాబోతున్నారనే వార్తలు వస్తున్నాయి.