చిరు, ప్రభాస్ ఒకే రోజున వస్తున్నారా..?
మెగాస్టార్ నటిస్తోన్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పైన రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని సమ్మర్‌లో రిలీజ్ చేయాలనుకున్నారు కానీ.. అనుకున్న ప్రకారం షూటింగ్ కాకపోవడం.. గ్రాఫిక్స్ వర్క్ చాలా ఉండడం కారణంగా ఆగష్టు 15న రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ఆగష్టు 15న రిలీజ్ చేయాలనుకోవడానికి మరో కారణం. నరసింహారెడ్డి స్వాతంత్ర్య సమరయోధుడు అందుచేత ఆగష్టు 15 కరెక్ట్ డేట్ అని భావిస్తున్నారని తెలిసింది.
ఇదిలా ఉంటే... యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం సాహో. ఈ చిత్రానికి రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. విదేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం గ్యాప్ తీసుకుంది. త్వరలో మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీని కూడా ఆగష్టు 15న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇదే కనుక నిజమైతే.. చిరు, ప్రభాస్ పోటీ పడతారా..? ఇద్దరిలో ఒకరు డేట్ మార్చుకుంటారా అనేది చూడాలి.