సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Updated : మంగళవారం, 20 నవంబరు 2018 (17:45 IST)

96 త్రిషకు ప్రభాస్ ఆ చిత్రం రీమేక్‌లో సూటవుతాడా?

తమిళంలో ఇటీవలే విడుదలైన 96 చిత్రం బాక్సాఫీస్ వద్ద బద్ధలు కొడుతూ రికార్డులు సృష్టించింది. చిత్రం విడుదలై రెండు నెలలు కావస్తున్నా ఇంకా ఆ చిత్రాన్ని చూసేందుకు అక్కడి జనం ఎగబడుతున్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటి త్రిష నటించింది. వన్ సైడ్ లవర్‌గా విజయ్ సేతుపతి నటించాడు.
 
ఇలాంటి ప్రేమలతో చాలామంది వుంటారనుకోండి. అదేమిటంటే... ఒకరిని ప్రేమిస్తారు... ఇంకొకరిని పెళ్లి చేసుకుంటారు. ఐతే కొందరు తాము ప్రేమించినవారు దక్కలేదని అసలు పెళ్లే చేసుకోవడం మానేస్తారు. అదే 96 చిత్రం. ఈ చిత్రంలో పెళ్లి చేసుకున్న ప్రేమికురాలిగా త్రిష నటించింది. పెళ్లికాని ప్రేమికుడిగా విజయ్ సేతుపతి నటించాడు. 
 
ఇక అసలు విషయానికి వస్తే... ఈ 96 చిత్రం రీమేక్ హక్కులు దిల్ రాజు సొంతం చేసుకున్నారు. కానీ ఈ చిత్రం అల్లు అర్జున్‌కి పిచ్చపిచ్చగా నచ్చేసిందట. అందుకని... ఆ చిత్రాన్ని తనకివ్వమని దిల్ రాజును అడిగాడట అల్లు అర్జున్. దీనిపై దిల్ రాజు ఏమన్నారో తెలియదు... కానీ ఈ చిత్రంలో 96 హీరోయిన్ త్రిషనే తీసుకోవచ్చు కానీ ముదురు హీరోగా నటించేది ఎవరు అని ప్రశ్నించాడట దిల్ రాజు.

ఈ ప్రశ్నకు అల్లు అర్జున్ సైలెంట్ అయ్యారట. ఐతే అక్కడున్నవారు కొందరు... వర్షంలో త్రిష పక్కన నటించిన ప్రభాస్ అయితే సూపర్ గా వుంటుందని అన్నారట. మరి ఈ మాటను ప్రభాస్‌కు చెబితే ఒప్పుకుంటాడా?