గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 25 అక్టోబరు 2018 (12:14 IST)

ప్రభాస్ పెళ్లి కన్ఫామ్.. వివాహం ఎపుడంటే...

టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ ప్రభాస్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అతని పెళ్లి ఎపుడంటే.. వచ్చే యేడాది జరుగుతుందని ఆయన సన్నిహితులు బల్లగుద్ది వాదిస్తున్నారు. పైగా, ఇవి రూమర్స్ కాదనీ, ఖచ్చితంగా 2019లో వివాహం జరుగుతుందని వారు నమ్మబలుకుతున్నారు. 
 
నిజానికి ఇటీవలే ప్రభాస్ తన 39వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఆ రోజున ఆయన తన పెళ్లిపై ఓ స్పష్టమైన ప్రకటన చేస్తారని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, ఎలాంటి ప్రకటన చేయకుండా ఫ్యాన్స్‌ను ప్రభాస్ నిరాశపరిచారు. 
 
ఈ నేపథ్యంలో ప్రభాస్‌కు పెళ్లి విషయంలో తన కుటుంబం నుంచి ఒత్తిడి పెరిగిందట. దీంతో వచ్చే ఏడాది పెళ్లికి సిద్ధమైపోతున్నట్టు సమాచారం. 'సాహో' సినిమాను పూర్తి చేసుకున్న అనంతరం 2019లో ప్రభాస్ పెళ్లికి సిద్ధమైపోతాడని టాక్.
 
నిజానికి 'బాహుబలి' పూర్తైన వెంటనే పెళ్లి చేసుకుందామనుకున్నాడట కానీ వెంటనే 'సాహో' ప్రారంభమవడంతో బ్రేక్ పడిందట. ఈ సినిమా కోసం చాలా సమయాన్ని ప్రభాస్ వెచ్చిస్తున్నాడు. దీంతో తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు. త్వరలోనే ప్రభాస్ ఒక మంచి అమ్మాయి కోసం వెదుకుతున్నట్టు న్యూస్ కూడా వస్తుందని తెలుస్తోంది.