మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: మంగళవారం, 23 అక్టోబరు 2018 (13:49 IST)

పెళ్లికి ముందు శృంగారం చేశా.... ఇప్పుడేమో పిల్లలు పుట్టడం లేదు..

నేను సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నా. నాతోపాటు పని చేసే ఓ యువతిని ప్రేమించా. వివాహం చేసుకోవాలనుకున్నాం. అయితే, ఆమెతో వివాహానికి ముందే శృంగారంలో పాల్గొన్నాను. ఆ తర్వాత పెళ్లయింది. ఇప్పుడేమో నా భార్యకు పిల్లలు పుట్టడంలేదు. మా ఇద్దరికీ ఆందోళనగా వుంది.. అసలు ఏం జరిగి వుంటుందీ?
 
పెళ్ళి చేసుకోకుండా శృంగారంలో పాల్గొనడం తప్పు. అలా చేసేటపుడు గర్భం నిరోధించేందుకు చాలామంది పలు పద్ధతులను పాటిస్తుంటారు. కొందరిలో అవి వికటిస్తే ఆరోగ్యపరంగా సమస్యలు వస్తాయి. కొందరు అవాంఛిత గర్భం పోగొట్టుకునేందుకు ఏవేవో నాటు మందులను సైతం వేసుకుంటారు. ఫలితంగా వారి ఆరోగ్య దెబ్బ తింటుంది. మీ విషయంలో పెళ్లికి ముందు శృంగారం జరిపిన తర్వాత ఏం జరిగిందో వివరించలేదు. పైన పేర్కొన్న పద్ధతులను పాటిస్తే అవి అడ్డంకిగా మారే అవకాశం లేకపోలేదు. 
 
కొందరిలో అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు అవలంభించే పద్ధతుల వల్ల ట్యూబ్స్ మూసుకు పోయి వంధ్యత్వం ఏర్పడి పిల్లలు పుట్టక పోవచ్చు. ఐతే పైన పేర్కొనవేమీ కాకుండా వున్నట్లయితే తగు గైనకాలజిస్టును సంప్రదించి సమస్యను తెలుసుకోవాల్సి వుంటుంది.