ఆదివారం, 12 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: శుక్రవారం, 19 అక్టోబరు 2018 (20:46 IST)

అవన్నీ శనగ గింజంత చేసుకుని రాత్రివేళ తీసుకుంటే శృంగారమే శృంగారం

కొందరు శృంగార సమస్యలను ఎదుర్కొంటూ చాలా ఇబ్బందులు పడుతుంటారు. రాత్రివేళ కేవలం ఐదు నిమిషాల్లోనే అంతా ఆయిపోయి నీరసించిపోతారు. ఇది చాలామంది స్త్రీలకు నచ్చని విషయమే. కావాలని అడగలేదు... అలాగని ఏమీ చేయలేరు. మౌనంగా దిగమింగుకుంటూ వుంటారు. ఇలా త్వరగా శృంగారం ముగిసిపోయి భాగస్వామిని ఇబ్బందిపెట్టేవారు తాము తీసుకుంటున్న ఆహారంలో చిన్నచిన్న మార్పులు చేసుకుంటుంటే శృంగార జీవితం హాయిగా వుంటుంది. సుఖమయంగా గడుస్తుంది. 
 
ఇంకా ఏవేవో బిళ్లలు తీసుకునే బదులు ఆయుర్వేదంలో శృంగార సామర్థ్యాన్ని పెంచే మందులున్నాయని చెపుతారు. ఇలాంటి వాటిలో.... పచ్చకర్పూరం 5 గ్రాములు, జాజికాయ 5 గ్రాములు, జాపత్రి 5 గ్రాములు తీసుకుని మూడింటిని మెత్తగా నూరి, దాంట్లో 5 గ్రాముల ఎండుద్రాక్ష వేసి మళ్లీ నూరి ఆ తర్వాత ఆ పేస్టును తీసుకుని వాటిని శనగ గింజంత మాత్రలుగా తయారుచేసుకోవాలి. రోజూ పడుకోబోయే ముందు ఒక్క మాత్రను వేసుకుని పాలు తాగితే వీర్యం వృద్ధి చెందడమే కాకుండా శృంగార సామర్థ్యం కూడా పెరుగుతుంది.