మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By
Last Updated : సోమవారం, 15 అక్టోబరు 2018 (18:53 IST)

ఆన్‌లైన్‌లో పిలిస్తే వెళ్లాను... ఆమె అలా చేసేసింది... ఫోన్ స్విచాఫ్...

ఈ భయంతో వణికిపోతున్నాను. నా ఈ అనుభవాన్ని ఎవరికైనా చెప్పాలంటేనే సిగ్గుతో ఏం చేయాలో అర్థం కావడంలేదు. నగరంలో నాకు ఇటీవలే ఉద్యోగం వచ్చింది. నా గదిలో నేనొక్కడినే. ఆన్‌లైన్‌లో సైట్లు చూస్తుంటాను. అలా చూస్తున్న సమయంలో ఓ అందమైన అమ్మాయి పరిచయమైంది. ఆన్‌లైన్ ద్వారా మాటలు కలుపుతూ ఇద్దరం ప్రేమించుకుందాం అని చెప్పింది. 
 
అలా మా పరిచయం శృంగారం వరకూ వెళ్లింది. ఓ రోజు సన్నిహితంగా వుండటంతో శృంగారం చేయబోయాను. దాంతో ఆమె నా భుజంపై గట్టిగా కొరికింది. దాంతో నాకు ప్రాణం పోయినంత పనైంది. అదేమని అడిగితే తనకు మూడ్ వస్తే అలానే చేస్తానంది. తీవ్రమైన నొప్పి పెడుతుండటంతో ఆ కోరిక అప్పటికి చచ్చిపోయింది. దాంతో వచ్చేవారం కలుద్దామని అంది. మళ్లీ ఫోన్ చేస్తే ఆ నెంబరు పనిచేయడంలేదు. నా భుజంపై ఆమె కొరికిన గాయం కొద్దిగా మానింది కానీ దానివల్ల ప్రమాదమేమైనా కలుగుతుందేమోనని భయంగా ఉంది...
 
అపరిచత వ్యక్తులతో అబ్బాయిలైనా, అమ్మాయిలైనా ఇలాంటి సంబంధాలను పెట్టుకోరాదు. ఆన్‌లైన్‌లో ఇలాంటి మోసాలు ఎక్కువని ఎన్నోసార్లు చూస్తూనే ఉంటాం. ఐనా కొందరు ఇలాంటి ఉత్సాహం చూపిస్తే ఇలాంటి సమస్యలే వస్తుంటాయి. ఆమె కొరకడం వల్ల సెప్టిక్ అయ్యే అవకాశాలున్నాయి కాబట్టి ముందు వైద్యుడి సూచన మేరకు చికిత్స చేయించుకోండి. ఇకపై అటువంటి కోరికలకు మనసులో తావు ఇవ్వవద్దు. ఉద్యోగం వచ్చింది కనుక తగిన అమ్మాయిని చూసి వివాహమాడండి.