శనివారం, 9 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 22 అక్టోబరు 2018 (20:16 IST)

శృంగారంలో మునిగిపోయి అదే ప్రపంచం అనుకుంటే...

శృంగారం అంటే భార్యాభర్తల మధ్య జరిగే ఒక తీపి అనుభవం. శృంగారం  అనేది తీపి అనుభవంలా ఉండాలే కానీ చేదు అనుభవంలా అవకూడదు. జీవితంలో శృంగారం ఒక భాగం కావాలే తప్ప జీవితమే శృంగారం కాకూడదు. అలా జరిగితే జీవితం ప్రమాదకరంగా మారిపోతుంది. జీవితంలో ఇతర కార్యక్రమాలు చాలానే ఉంటాయి. వాటినన్నింటిపై దృష్టి పెట్టి అన్నింటికి సమ న్యాయం చేయాలి. అలా కాకుండా శృంగారంలో మునిగిపోయి అదే ప్రపంచంగా ఉంటే మాత్రం జీవితం పూర్తిగా నాశనమైపోతుంది.
 
కొంతమంది యువత ఎవరితోనైనా పరిచయం కలిగితే పెళ్లి కాకముందే వారితో శారీరకంగా కలవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. ఉదయం లేచినప్పటి నుంచి ఆ పరిచయమైన వ్యక్తిని తరచూ గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఇదంతా అనుకోకుండానే జరుగుతుంది. ఎందుకంటే ఆలోచన మొత్తం శృంగారపైనే ఉంటుంది కాబట్టి. అంతేకాకుండా ఆ వయసు ప్రభావం కూడా ఉంటుంది. 
 
ఇలాంటివారు శృంగారంపైనే ఎక్కువ దృష్టి పెడుతుంటారు. కాబట్టి మిగిలిన ఏ విషయాలపైనా ఆలోచనలు వుండవు. శృంగారానికి బానిసలయ్యారనడానికి ఇదో ఉదాహరణ. ఇది చాలా ప్రమాదకరం. పెళ్లికాక ముందే శృంగారంలో పాల్గొనడం సరియైన పద్ధతి కాదు. పెళ్లికి ముహుర్తం, మంచి రోజు చూసినట్లే పెళ్లైన దంపతులకు మొదటి రాత్రికి కూడా ముహూర్తం మంచిరోజు చూస్తారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. దీని వెనుక ఖచ్చితంగా ఒక పరమార్థం ఉంటుంది. తొలిరాత్రిన భార్యాభర్తలిద్దరి పవిత్రమైన శరీరాలు శారీరకంగ కలవడానికి ముహుర్తాన్ని పెడతారు. ఇది భారతీయ సంప్రదాయం. 
 
కానీ ఇప్పటి యువత ఇవేమి పట్టించుకోకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. పెళ్లికాక ముందు శృంగారం గురించిన ఆలోచనలను నియంత్రించుకోవడం చాలా మంచిది. నిరంతర ఆలోచనలు నిస్సత్తువ చేస్తాయి. ఇలాంటి ఆలోచనలు వస్తుంటే వెంటనే యోగా చేయడం ప్రారంభించాలి. లేకుంటే ఆశ్రమానికి వెళ్ళాలి. అదీ కుదరకపోతే భక్తి తత్వంపై ఎక్కువ దృష్టి మరల్చాలి. అప్పుడు తేలికగా వీటి నుంచి బయటపడవచ్చు.