గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 17 నవంబరు 2018 (17:10 IST)

''సాహో'' మేకింగ్ వీడియో.. కోట్లు సంపాదించి పెడుతోంది.. ఎవరికి?

రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత ''సాహో''లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ మూవీగా ఈ సినిమా రూపొందుతోంది. వచ్చే ఏడాదిలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా మేకింగ్ టీజర్‌ ప్రభాస్ పుట్టిన సందర్భంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ వీడియో భారీ వ్యూస్‌తో యూట్యూబ్‌లో రికార్డులు సృష్టించింది. 
 
ఈ టీజర్లో ప్రభాస్ లుక్ అదిరింది. హాలీవుడ్ రేంజ్‌లో వుందని సినీ ఫ్యాన్స్ మురిసిపోయారు. ఇప్పుడు ఇదే వీడియో ప్రభాస్‌కి కోట్లు సంపాదించి పెట్టింది. ఈ వీడియో చూసిన ప్రముఖ బైక్ కంపెనీ బ్రాండ్ ఎండార్స్‌మెంట్ కోసం ప్రభాస్‌ని సంప్రదించినట్లు వార్తలొస్తున్నాయి. డీల్ కుదుర్చురునేందుకు భారీ మొత్తంలో ప్రభాస్‌కి ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. 
 
ప్రభాస్ కూడా ఈ డీల్ విషయంలో ఆసక్తి చూపిస్తున్నాడని త్వరలో ఈ డీల్‌ను కుదుర్చుకునేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ బైక్ కంపెనీ మాత్రమే కాకుండా ఇతర కార్పొరేట్ కంపెనీలు కూడా బ్రాండ్‌ని ప్రమోట్ చేయమని ప్రభాస్ వెంట పడుతున్నాయి. దీంతో సాహో మేకింగ్ వీడియోతోనే ప్రభాస్ కోట్లు సంపాదించుకునేందుకు రెడీ అవుతున్నాడు. ఇక సాహో విడుదలైతే ప్రభాస్ చేతిలో ఎన్ని డీల్స్ వస్తాయో వేచి చూడాలి.