మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 22 అక్టోబరు 2018 (09:30 IST)

ప్రభాస్ అంటే ఇష్టం... అడగ్గానే ఒకే చెప్పేందుకు ఆలోచించలేదు... : పూనమ్ బజ్వా

'బాహుబలి' చిత్రంలో ఇంటర్నేషనల్ స్టార్‌గా ఎదిగిన హీరో ప్రభాస్. ఈ ఒక్క చిత్రంతో ప్రభాస్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఆయన సరసన నటించేందుకు దక్షిణాది భామలే కాదు ఉత్తరాది భామలు సైతం ఉవ్విళ్లూరుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఉత్తరాది భామ పూనమ్ బజ్వా తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమెను టాలీవుడ్‌లో ఏ హీరోతో పని చేయాలనుకుంటున్నారని ప్రశ్నించగా.. ప్రభాస్ అంటూ తన మనసులో మాట బయటపెట్టింది. తొలుత చాలా మంది ఉన్నారంటూ సమాధానం దాటేయడానికి ప్రయత్నించినా.. ఆఖరుకి ప్రభాస్ పేరును చెప్పేసింది. 

ఎన్టీఆర్ బయోపిక్‌లో భాగం కావడం చాలా సంతోషాన్నిస్తుందన్నారు టాలీవుడ్ నటి పూనమ్ బజ్వా. ఎన్టీఆర్ పెద్దకూతురు లోకేశ్వరి పాత్రలో తాను కనిపించబోతున్నట్టు చెప్పారు. దర్శకుడు క్రిష్ తనకు మంచి స్నేహితుడని.. రెండోసారి ఆలోచించకుండా సినిమా చేయడానికి ఒప్పుకున్నానని తెలిపారు.