ఆ విషయం చెబితే హీరోలు హర్ట్ అవుతారు : కీర్తి సురేష్
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నటి కీర్తి సురేష్. మహానటి చిత్రంతో ఈమె నటనకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హీరో విశాల్ నటించిన చిత్రం పందెంకోడి 2. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఆమె ఆదివారం హైదరాబాద్‌కు వచ్చారు.
ఈ సందర్భంగా ఆమె సరదాగా విలేకరులతో మాట్లాడుతూ, ఈ సినిమాలో నా నటనను అంతా మెచ్చుకుంటున్నారు. లింగుస్వామి కథ చెప్పినప్పుడే నమ్మకం కలిగింది. ఒకవేళ ఈ సినిమా చేసి ఉండకపోతే.. ఓ మంచి అవకాశాన్ని కోల్పోయేదాన్ని అని చెప్పింది.
అలాగే, హీరో విశాల్ విషయానికొస్తే.. ఆయన చాలా నిరాడంబరమైన నటుడు. అంతేకాదు నటీనటుల సంఘం కార్యదర్శిగా, నిర్మాత మండలి అధ్యక్షుడిగా, నిర్మాతగా, నటుడిగా ఆయనలోని పలు కోణాలు చూసినట్టు తెలిపింది.
ఇకపోతే, చిన్నప్పటి నుంచి తాను చూస్తూ పెరిగిన హీరోలతోనే ఇపుడు నటించాల్సి వస్తోందన్నారు. కానీ, ఏ హీరో దగ్గరా చిన్నప్పుడు మీ సినిమాలు చూస్తూ పెరిగాను అని అస్సలే అనను. ఎందుకంటే వయసు గురించి మాట్లాడితే హీరోలు హర్ట్ అవుతారోనని నా ఫీలింగ్. నేను చిన్నప్పటి నుంచీ స్క్రీన్‌మీద చూసి ఆస్వాదించిన వాళ్ళను చూస్తే నాకు చాలా గౌరవం. వాళ్లని కొలీగ్స్‌గా చూడలేను. అంతా దేవుడి దయ అని కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.