ఒకే వేదికపై ట్రిపుల్ ఆర్ కాంబినేషన్ ... ఫోటో వైరల్
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ఇటీవల తొలి షెడ్యూల్ పూర్తి చేసుకోగా, జనవరి నుండి మరో షెడ్యూల్ జరుపుకోనుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
2020లో ఈ మూవీ విడుదల కానుంది. అయితే ఈ రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ అంటే అభిమానులలో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో వీరు ముగ్గురు కలిసి దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది.
పైగా, ఈ ముగ్గురు ఒకే వేదికను పంచుకోనున్నారు. ఈ వార్త ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి రేకిత్తిస్తోంది. అతి త్వరలో చెర్రీ నటించిన "వినయ విధేయ రామ" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించాలని దర్శకనిర్మాతలు నిర్ణయించారట.
అయితే ఈ ఈవెంట్‌కు రాజమౌళి, ఎన్టీఆర్‌ని ఆహ్వానించాలని చిత్ర బృందం భావించినట్టు తెలుస్తుంది. ఈ చిత్ర నిర్మాత దానయ్యనే 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని కూడా నిర్మస్తుండడంతో ఎన్టీఆర్, రాజమౌళి ఈ ఈవెంట్లో పాల్గొనడం పక్కా అని అంటున్నారు.