1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. PM Narendra Modi AP tour may be postponed, Why?

ఆంధ్రప్రదేశ్‌లో మోడీ పర్యటన వాయిదా పడుతోందా?

PM Narendra Modi
భారత ప్రధాని నరేంద్ర మోడీ జనవరి 6వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించాల్సి ఉంది. ఇప్పటికే తెలుగుదేశం బీజేపీ వర్గాలు మోడీ పర్యటనపై  కత్తులు దూసుకుంటున్నాయి. ఏ మొహం పెట్టుకుని మోడీ ఆంధ్రప్రదేశ్‌కు వస్తారని తెలుగుదేశం వర్గాలు విమర్శిస్తుంటే.. గత నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసింది చెప్పడానికే మోడీ పర్యటనకు వస్తున్నారని బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. 
 
రాష్ట్రానికి నరేంద్రమోడీ అన్యాయం చేశారంటూ ప్రతిరోజూ గగ్గోలు పెడతున్న తెలుగుదేశం నేతలు తాజగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న నేపథ్యంలో మోడీ పర్యటనపై తీవ్ర ఆసక్తి నెలకొని ఉంది. అయితే జనవరి 6 వతేదీన ఏపీలో మోడీ పర్యటన వాయిదా పడ్డట్టు సమాచారం. అదే రోజు ప్రధాని కేరళ పర్యటన ఉన్నందున సమయాభావం మూలంగా మరొక తేదీ ఖరారు చేయడానికి ప్రధాని కార్యాలయ వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. 
 
ఈ మేరకు ఇప్పటికే ఏపీ బీజేపీ నాయకత్వానికి సమాచారం పంపింది ప్రధాని కార్యాలయం, అయితే ఆంధ్రప్రదేశ్  పర్యటనను యధావిధిగా ఉంచాలని కేరళ పర్యటనను వాయిదా వేయాలని ప్రధాని కార్యాలయ అధికారులను ఏపీ బీజేపీ నాయకత్వం కోరింది. అయితే అన్ని విషయాలు పరిశీలించి మోడీ పర్యటనను ఖరారు చేయనున్నారు ప్రధాని కార్యాలయం అధికారులు.
About Writer
శ్రీ
తర్వాతి కథనం
పక్కింటి యువకుడితో ఎఫైర్... మామ వద్దన్నందుకు ఆ పని చేయించింది...