తనతో శృంగారం చేసినట్లు కల వచ్చిందని చెప్పా... కానీ...

romance
Last Modified బుధవారం, 26 డిశెంబరు 2018 (15:02 IST)
నేను కాలేజీ చదువుకునే రోజుల్లో నాకొక స్నేహితురాలు ఉండేది. ఆమెను చాలా ఇష్టపడేవాడిని. తను కూడా తన పట్ల ఎంతో ప్రేమపూర్వకంగా నడుచుకునేది. మా ఇద్దరి భావాలను ఒకరికొకరు వ్యక్తపరుచుకునేవాళ్లం. ఆమెకు వివాహమైన మూడేళ్ల తర్వాత నా స్నేహితుని ద్వారా ఆమె ఫోన్ నంబర్ లభించింది.

ఒక రోజున నేనే ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాను. అప్పటి నుంచి మేం రెగ్యులర్‌గా మాట్లాడుకోవడం జరుగుతోంది. అలా కొంతకాలం తర్వాత మా ఇద్దరి మాటలు మరింత దగ్గరయ్యాయి. నేనామెకు ఫోనులో ముద్దులు పెట్టాను. నాలుగైదు రోజులు నేను ఫోన్ చేసినప్పుడల్లా కట్ చేసింది. ఆ తర్వాత సారీ చెపుతూ టెక్ట్స్ మెసేజ్ ఇచ్చాను. ఆమె ఫోన్ కట్ చేసినా నేను చేస్తూనే వున్నాను. చివరికి నన్ను క్షమించింది. మళ్లీ మాటల సందర్భంగా తనంటే నాకు పిచ్చి ప్రేమ అని చెప్పాను. తనతో శృంగారం చేసినట్లు కలలు కూడా వస్తున్నాయని అన్నాను. ఆమె నవ్వేసి దానిపై స్పందించలేదు. ఆమె నా కోర్కెను అంగీరించినట్లా?

చాలామంది మహిళలు ఏదో పోనీలే అని వదిలేస్తుంటారు. స్నేహితుడివి కదా అని ఆమె వదిలేస్తున్నట్లుంది. ఒకసారి ఫోన్ కట్ చేసినప్పుడే మీకు విషయం అర్థమైవుండాలి. ఐనా ఆ తర్వాత ప్రేమిస్తున్నాననీ, శృంగారం కలలు వస్తున్నాయని చెప్తుంటే... ఓ అమాయకుడని వదిలేస్తున్నట్లుంది. సీరియస్‌గా తీసుకుంటే పరిస్థితి మరోలా వుండొచ్చు. కాబట్టి ఆమెతో అలాంటి ఆలోచనలు మానేసి ఓ స్నేహితురాలిగా మెలిగితే గౌరవం వుంటుంది.దీనిపై మరింత చదవండి :