సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: సోమవారం, 24 డిశెంబరు 2018 (18:04 IST)

పెళ్లాడబోతున్నాం కదా అని శృంగారం చేశా... అది వస్తుందని గొడవ చేస్తోంది...

త్వరలో నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నా. ఐతే ఆమెతో రుతుచక్రం (మెన్సస్) తేదీకి నాలుగు రోజుల ముందు శృంగారంలో పాల్గొన్నా. శృంగారం పూర్తయిన వెంటనే ఐపిల్ మాత్రలు కూడా తీసుకుంది. కానీ ఆమెకి ఎప్పటిలా రాలేదట. దీంతో ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయివుంటుందని ఆమె గొడవ చేసి ఏడుస్తోంది. నిజంగానే ఆమె గర్భందాల్చివుంటుందా?
 
శృంగారం పూర్తయ్యాక నిర్ణీత సమయంలో ఐపిల్ మాత్రలు వేసుకుంటే గర్భం దాల్చేందుకు అవకాశం తక్కువ. అలాగే, రుతుచక్ర తేదీకి మూడు రోజుల ముందు అంటే సేఫ్ రోజుల్లోనే శృంగారంలో పాల్గొనడం జరిగింది. అందువల్ల గర్భం వచ్చే అవకాశాలు తక్కువే అయినప్పటికీ కొన్నిసార్లు ఇది రివర్స్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇలా పెళ్లికి ముందే శృంగార ప్రయత్నాలు మానుకోండి. వెంటనే గైనకాలజిస్టును సంప్రదించండి.